ఈ భావోద్వేగం యోనికో మనసుకో పరిమితమైంది కాదు. మొత్తం మనసు శరీరాల కలయికల స్పందన ఇది. రతి పతాక స్ధాయిలో పొందే తీయని మధురానుభూతిలో శరీరంలోని ప్రతి భాగం, ప్రతి అణువు పాలు పంచుకుని భావప్రాప్తిని అందించడంలో భాగస్వామ్యం అవుతాయి. భావప్రాప్తి సమయంలో ఆమె ముఖంలో మార్పులు స్పష్టంగా కన్పిస్తాయి. కొందరు ఆ సమయంలో హిస్టీరిక్ గా ప్రవర్తిస్తారు. రతిలో పాల్గొన్నప్పుడల్లా భావప్రాప్తి పొందే స్త్రీల మొహంలో అదొకరకమైన ఆనంద భావన కన్పిస్తుంది. ఇటువంటి స్త్రీలు పురుషుడిని మూడ్ లేదంటూ బాధ పెట్టడం జరగదు. వాళ్ళే చొరవ తీసుకుని అతనికి ఇన్ స్పిరేషన్ గా నిలుస్తారు.
భావప్రాప్తి అనేది నాలుగు అక్షరాల పదమైనా అది ఒక సినిమా అంత పెద్దది. మగవాళ్ళకి భావప్రాప్తి అంటే స్కలనం ఎంతో సులభం. మహిళకు అలాకాదు. ఆమెకు భావప్రాప్తి కలిగించాలంటే అతను ఎంతో యుక్తిగా కష్టపడాలి. భావప్రాప్తి సమయంలో స్త్రీ శరీరం యమటోనిక్ టెన్షన్ కు గురవుతుంది. భావప్రాప్తి సమయంలో ఆమె రక్తప్రసరణలోనూ కండరాల బిగువులోనూ మార్పులు జరుగుతాయి. ఈ మార్పుల వల్ల ఆమెలో లైంగికోత్తేజం, కామోద్రేక పతాక స్ధాయికి చేరుకుంటుంది. ఆమెలో పరిపూర్ణ తృప్తిని, అనిర్వచనీయ ఆనందాని కలింగించేది కాబట్టి దీనికి అర్ధవంతంగా భావప్రాప్తి అని పేరు పెట్టారు. హాయైన "భావ"న, "ప్రాప్తి" లభించడమంటే ఇదే.