•  

తెలియకపోతే సంభోగంపై ద్వేషం

Reason for hate on Sexual activity
 
కామ విషయాలు తెలియని సున్నితమైన యువతులు సంభోగాన్ని ద్వేషిస్తారని కామ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అలాంటి యువతులతో బలవంతంగా భర్త సంభోగం జరిపితే జీవితాంతం ద్వేషిస్తారు. రతి అంటే అయిష్టత కూడా ఏర్పడుతుంది. అటువంటివారికి ముందుగా కామ విషయాలు చెబుతూ చైతన్యవంతులను చేయాలి. అటువంటి యువతిని సానుకూలం చేసుకునేందుకు పురుషుడు చాలా సహనంతో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. మెల్లగా సానుకూలం చేసుకోవాల్సి ఉంటుంది. మొదట తరుణ స్త్రీల ద్వారా ప్రేమ భావన కలిగించాలి. ఆ తర్వాత చీకటిలో గానీ ఏకాంత ప్రదేశంలో గానీ ఆమెను కౌగలించుకుని నోటికి తాంబూలం అందజేయాలని కామశాస్త్ర నిపుణులు సలహా ఇస్తున్నారు. ప్రతికూలంగా ఉన్న కన్యను ప్రణయ వచనాలతో, శపథాలతో, పాదపతనంతో వశం చేసుకోవాలి. చుంబనం, ఆలింగనం వంటి క్రియల ద్వారా, కామక్రీడకు సంబంధించిన మృదు మాటల ద్వారా సానుకూలం చేసుకోవాలి. అంటే, ఇరువురి మధ్య స్నేహ భావం పెరగాలి.

Story first published: Monday, August 30, 2010, 16:16 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras