•  

భార్యను రంజింప చేసే కళలు ఎన్నెన్నో...

More ways to Satisfy her
 
భార్య రంభలా ఉంటుంది. అయినా అతను అందవిహీనమైన ప్రియురాలంటే ఇష్టపడుతూ ఆమె చుట్టూ తిరుగుతాడు. దీనికి కారణం అంద విహీనురాలైనా ఆమె నెరజాణ కావడమే. సెక్స్ లో ఆనందం కలగడానికి అందం ఒక్కటే చాలదు. ఆమె నుంచి చొరవ, లైంగిక ప్రేరణ అవసరం. ఎలాంటి విషయాలు లైంగిక ఉద్దీపన కలిగిస్తాయో ఇద్దరూ తెలుసుకోవాలి. దీనినే సెన్సువల్ కమ్యూనికేషన్ అంటారు. ఇది పడక గదికే కాదు దంపతుల నిత్య జీవితంలో భాగం కావాలి.

లైంగిక ప్రేరణలో స్పర్శ, కనుచూపు, నవ్వు, పెదవుల రుచి ప్రముఖపాత్ర వహిస్తాయి. భర్త వచ్చే సమయంలో కూరగాయలు కోస్తూ టీవీ చూడడం కంటే పూలుమాల కట్టు కుంటూ అతని కోసం ఎదురు చూడాలి. రాగానే ఒక అందమైన నవ్వు నవ్వాలి. అతను కూడా అంతకంటే ఆహ్లాదంగా ఉండాలి. ఇల్లాలు అలా ఉంటే అతను అంత కంటే ఉల్లాసంగా ఉంటాడు. ముద్దులు, కౌగిలింతలు, చూపులు, శృంగార సంభాషణలు, సువాసనలు సెక్స్ కు ముందు మంచి ప్రేరకాలుగా పనిచేస్తాయి. సెక్స్ లో మొదటిది ఫోర్ ప్లే. అది చాలాసేపు జరగాలి.

అంటే ముద్దులు, కౌగిలింతలు, అవయవ ప్రేరణలు. తర్వాత అసలు రతి. ఆ తర్వాత ఆఫ్టర్ ప్లే. చాలా మంది పురుషులు ఫోర్ ప్లే ను, ఆఫ్టర్ ప్లేను పట్టించుకోరు. ఎంతవరకు అంగప్రవేశం కానిచ్చి ఆ పని త్వరగా పూర్తి చేసుకుని పక్కకు తిరిగి నిద్రలోకి వెళ్ళిపోతారు. దీని వల్ల ఆమె తీవ్ర అసంతృప్తికి గురవుతుంది. అలా కాకుండా చూసుకోవలసిన బాధ్యత అతనిదే.

Story first published: Wednesday, August 11, 2010, 17:48 [IST]

Get Notifications from Telugu Indiansutras