నరాలలో రక్తాన్ని పరుగులు పెట్టించే గుణం మల్లెపూలకు ఉంది. ఆఫీసు నుంచి వచ్చేటప్పుడు ఎన్ని ట్రాఫిక్ ఇబ్బందులున్నా పూల దుకాణం వద్ద ఆగి ఈ సీజన్ లో మల్లెపూలు కొనుక్కుని ఇంటికి చేరే మంచి అలవాటును పెంపొందించుకోండి. జడలో తురుముకోడానికే కాకుండా పడక మీద చల్లుకోడానికి కూడా కొన్ని విడిపూలు తెచ్చుకోండి. మల్లెపూలలో ఉన్న మరో రహస్యాన్ని ఈ చివర ప్రస్తావించాలి. మల్లెపూల పరిమళం వల్ల శీఘ్ర స్ఖలనం సమస్య తగ్గుతుంది. ఆ పరిమళ యాత్రలో ఇక రెచ్చిపోండి.
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టే ఇది కూడా. వేసవిలో మల్లెపూల మహత్యం కూడా అటువంటిదే. చాలా మంది మహిళలు యాంత్రికంగా వాటిని జడలో తురుముకుంటారే కానీ ఆ ప్రభావం గురించి వాళ్ళకి పూర్తిగా తెలియదు. వర్కింగ్ విమన్ తో మరో సమస్య. భర్త ప్రేమగా మల్లెపూల మాలను కొనుక్కొని వచ్చినా వాటిని భద్రంగా ఫ్రిజ్ లో పెట్టి మరునాడు ఆఫీసుకు వెళ్ళేటప్పుడు పెట్టుకుంటారు. దానితో భర్తకు బాధ, కొందరు భర్తలకు అనుమానం, పెనుభూతం.