స్త్రీ యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశపెట్టినప్పుడు ఆ కదలికల వల్ల ఎటువంటి ఫ్రిక్షన్ ఉంటుందో యోనిలో వేలు పెట్టుకుని కదలికలు చేసినా అటువంటి అనుభూతే కలుగుతుంది. హస్తరతి వల్ల శృంగార సామర్ధ్యం తగ్గదు. హస్తరతికి అలవాటుపడి ఆ తర్వాత అసలు రతిలో పాల్గొనలేని వారు ఉంటారు. అందుకు కారణం భయాలు, అపోహలే తప్ప హస్తరతి వల్ల కలిగిన దోషం కాదు. అమాయక మిత్రులు, స్వార్ధపరులైన వైద్యులు హస్తరతి గురించి భయపెట్టి భయాందోళనలకు గురి చేస్తూ ఉంటారు.
స్వయంతృప్తిలో తమకు ఇష్టమైన వారిని ఊహించుకుని ఆనందాన్ని తృప్తిని పొందుతారు. దీనివల్ల సృజనాత్మకత పెరుగుతుంది.ఇలా సంతృప్తి చెందడం ఏమాత్రం తప్పు కాదు. డాక్టర్ సమరం 1974 లో ఈనాడులో సెక్స్ సైన్స్ గురించి కాలమ్ ప్రారంభించక ముందు రతి గురించి, హస్తరతి గురించి సామాన్య ప్రజల్లో అనేక అపోహలు ఉండేవి. హస్తప్రయోగం ఏమాత్రం హానికరం కాదని యువతరానికి కొండంత అండగా నిలిచింది సమరమే. ఈ విషయంలో తెలుగు సమాజాన్ని చైతన్యవంతం చేసి, శాస్త్రీయ స్పృహను పెంపొందించి ఆయనే.