•  

సెభాషైన సంభోగ విధానం

Premature Ejaculation
 
చాలా మందిని వేధిస్తూ, అనేక కాపురాల్లో చిచ్చు రగులుస్తున్న శీఘ్ర స్ఖలనం సమస్యకు మరో చక్కటి పరిష్కారముంది. బిగి కౌగిళ్ళు, ముద్దు ముచ్చట్లు, సరస సంభాషణలు, సున్నిత అవయవాల స్పర్శల వంటి ఫోర్ ప్లే తర్వాత ఇద్దరూ రతి క్రీడకు సిద్ధమవుతారు. ఇక్కడే సంయమనం పాటించాలి. తొందర పడకూడదు. సంభోగంలో పాల్గొనబోయే ముందు దంపతులు ఇద్దరూ విడివిడిగా ఒక గ్లాసు మంచినీళ్ళు తాగి విశ్రాంతిగా కూర్చోవాలి. శ్వాసను లోపలికంటా తీసుకుని నిదానంగా శ్వాసను విడుదల చేయాలి. ఇలా ఐదు నిముషాలు చేయాలి. ఈ శ్వాస వ్యాయామం వల్ల మానశిక ప్రశాంతత వృద్ధి చెందుతుంది. దీని వల్ల యాంగ్జయిటీ తగ్గిపోయి త్వరలో జరుగనున్న రతిలో ఇంద్రియ నిగ్రహం ఏర్పడుతుంది.

సంభోగానికి సంసిద్ధమైన దంపతులు మరో ముఖ్య సూత్రాన్ని తెలుసుకోవాలి. కామోద్రేకంలో స్త్రీకి యోని ముఖద్వారం, తర్వాత జి స్పాట్, యోనిశీర్షానికి ఒకేసారి రాపిడి కలిగించాలని స్త్రీ పురుషులిద్దరూ సాధారణంగా తొందర పడుతుంటారు. ఇక్కడ కూడా నిదానం అవసరం. ఇలా చేయడం వల్ల ఆమెలో కామోద్రేకం తీవ్రమై పురుషుడిని ఇంకా రెచ్చగొట్టడం, అతను కొన్ని క్షణాల్లో తీవ్ర ఆవేశానికి గురై ఔటై పోవడం, అమె నిరాశ చెందడం జరుగుతాయి. అందువల్ల మొదట స్త్రీ యోని శీర్షానికి రాపిడి కలుగకుండా యోనికి మాత్రమే రాపిడి కలిగే విధంగా నిదానంగా రతి ప్రారంభించాలి.

మొదట అంగం చొప్పించిన తర్వాత కొద్ది క్షణాలు స్త్రోక్స్ ఇవ్వకుండా నిగ్రహం పాటించాలి. ఆ తర్వాత క్రమంగా ఒక లయలో వేగం కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వెళ్ళాలి. ఎక్కువ సేపు రతి చేసుకున్నామన్న సంతృప్తి ఈ పద్ధతి ద్వారా తప్పకుండా కలుగుతుంది. ఇందులో మరో ఉపాయం ఉపరతి. అంటే పురుషుని పై నుంచి స్త్రీ రతి సాగించడం. వేగ రతికి వెళ్ళడానికి ముందు ఒకటి రెండు నిముషాలు ఈ పద్ధతి ఆచరిస్తే నిగ్రహశక్తి పెరుగుతుంది. ఆమెలో కామోద్రేకం తీవ్ర స్ధాయికి చేరుకున్న తర్వాతనే బలమైన స్టోక్స్ ఇచ్చి ఇద్దరూ మదన సామ్రాజ్యాన్ని జయించి హాయిగా, విశ్రాంతిగా కామ సముద్ర తీరానికి చేరుకోవాలి.

Story first published: Thursday, May 27, 2010, 17:32 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras