•  

ఆమెలో కోర్కెలు రగులుకోవాలంటే....

How to arise sex desire in her?
 
స్త్రీలలో శృంగార ఆసక్తి తగ్గడానికి అనేక కారణాలు ఉంటాయి. అందుకు మానసిక కారణాలే ఎక్కువ. శారీరకమైనవి కొన్ని ఉన్నా ప్రధానమైనవి మానసిక పరమైనవే. ఈ మానసిక కారణాలకు మూలాలు స్త్రీ శరీరంలో కాక పురుషాధిక్య సమాజంలో ఉన్నాయి. తీవ్రమైన మానసిక ఆందోళన, కొన్ని వ్యాధులకు వాడే మందుల దుష్ప్రభావాలు, హార్మోన్ల అస్తవ్యస్ధత, ఉద్యాగాలు చేసే మహిళల్లో పని ఒత్తిడి స్తీలలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణాలవుతాయి.

భార్యలో శృంగారేచ్చ తగ్గడానికి భర్తలో రసికత్వం తక్కువగా ఉండడం కూడా మరో ప్రధాన కారణం. ఆమెకు ఆ సుఖం పరాకాష్టకు చేర్చకుండా తన పని తాను యాంత్రికంగా ముగించుకోవడం వల్ల ఆమెకు సెక్స్ మీద విరక్తి కలుగుతుంది. స్త్రీలలో సెక్స్ పై ఆసక్తి పెంచడానికి వయాగ్రా వంటి మందులు లేవు. ఆమె అనాసక్తికి కారణం పురుషాధిక్యతే. స్త్రీ సెక్స్ లో ఏమాత్రం చొరవ ఎక్కువ తీసుకున్నా భర్తకు ఆమె మీద అనుమానాలు ఏర్పడతాయి. తన మీద నమ్మకం కోల్పోయేలా చేస్తాయి. అలా కాకుండా అమెతో ప్రేమగా ఉంటూ, పడకగదిలో స్వేచ్చగా ఉండనిస్తే ఆమెలో కోరికలు పురివిప్పుతాయి.

పల్లేటూళ్ళలో ఇప్పటికీ మహిళలు మంచిగా సెక్స్ ను ఎంజాయ్ చేయడం జరుగుతోంది. దానికి కారణం పని పాటల వల్ల శారీరక వ్యాయామం చేకూరి, శరీరంలో ఆక్సిజన్ పరిమాణం సమృద్ధిగా ఉండడం ఒక కారణం. సెక్స్ లో తాను దూకుడుగా వ్యవహరిస్తే భర్త అనుమానిస్తాడన్న భయాలు కూడా తక్కువగా ఉండడం, అన్నిటికీ మించి అమాయకత్వం వీటివల్ల ఆ మహిళలు సెక్స్ జీవితాన్ని బాగా చదువుకున్న మహిళల కంటే ఎక్కువగా ఎంజాయ్ చేయగలుగుతున్నారు.

Story first published: Tuesday, April 6, 2010, 17:20 [IST]

Get Notifications from Telugu Indiansutras