•  

సహజ శృంగారం ఒక మల్లె పందిరి

Sex Starved
 
కృత్రిమ పద్ధతుల ద్వారా భావ ప్రాప్తి సహజ భావప్రాప్తి అంత శోభను ఇవ్వదు. స్త్రీ పురుషుల శరీర రసాయన వాత్య్సాయనం పరిపూర్ణమైనది. కొన్ని క్షణాలు నిముషాలే అయినా అది మధురానుభూతే. ఇద్దరి మధ్య మంచి పొంతన, ప్రేమ ఉంటే నిజంగా ఆక్రీడ జరిగినా జరగకపోయినా మనసు మల్లెల పందిరి అవుతుంది. ఏ క్షణాన్నైనా ఆ భూకంపం సంభవిస్తుంది.

స్త్రీ పురుష సంభోగ సమయంలో విడుదలయ్యే ఎండార్ఫిన్ లు ఉభయుల శరీరాన్ని మనసును ఉత్తేజపరుస్తాయి. అవి మనసులో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. అందుకే చక్కటి శృంగారాన్ని అనుభవించిన వారిలో మొహం చిటపటలు ఉండవు. దైనందిన జీవితంలో వారు హాయిగా గాలిలో తేలిపోతున్నట్టుగా ఉంటారు.

భావప్రాప్తి లేని శృంగారం ఉప్పు లేని పప్పు వంటిది. భావప్రాప్తి విషయంలో స్త్రీ కంటే పురుషుడు ఎంతో అదృష్టవంతుడు. అతను ఎప్పుడంటే అప్పుడు మంత్ర దండం ఊపినట్టు భావప్రాప్ర్తి పొందగలడు. మరి పాపం ఆమె, నిజంగా బాధాకరమే. స్త్రీ సహజమైన బిడియాలు, శరీర నిర్మాణం అందుకు కారణాలు. సంభోగం సమభోగంగా మారాలంటే అతను "ఓపిక" పట్టాలి. తొందర పడకూడదు. ఫోర్ ప్లే మీద దృష్టి సారించాలి. మధ్య మధ్యలో మాటలు ఉండాలి. అంతే గానీ లేడికి లేచిందే పరుగు అన్న సామెత చందంగా ఉండకూడదు.

శృంగారంలో సరైన సంతృప్తి పొందని వారు మామూలు మనుషుల్లా ఆనందంగా ఉండలేరు. మానసికంగా కుంగిపోతున్నట్టు కన్పిస్తారు. ఏదో కోల్పోయామన్న ఫీలింగ్ ఉంటుంది. ఒక వేళ ఏ కారణాల వల్లనైనా భర్త ద్వారా సంతృప్తి పొందలేనప్పుడు, ఆ స్త్రీకి విపరీతమైన కోర్కె కలిగినప్పుడు స్వయంతృప్తి ద్వారా సంతృప్తి పొందడం ఆరోగ్యకరం. విదేశాల్లో అయితే అందుకు అనేక కృత్రిమ సాధనాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మన దేశంలో కూడా ఇవి కొన్ని లైసెన్స్ డ్ కస్టమ్స్ షాపుల్లో లభిస్తున్నాయి.

Story first published: Monday, February 22, 2010, 15:38 [IST]

Get Notifications from Telugu Indiansutras