•  

పడకగదిలో ప్రశాంతతకు చిట్కాలు ఎన్నో

Cell Phone to Dominate your Bed Room
 
సెల్ ఫోను అధికంగా వాడితే పురుషుడిలో పునరుత్పత్తి శక్తీ తగ్గిపోతుందని పరిశోధనల్లో వెల్లడైంది. దాని సంగతి పక్కన పెడితే సెల్ ఫోన్ పడక గదిని భయానకంగా మారుస్తుందని గ్రహించండి. మీ కొలీగ్స్ కు ముందే ఎస్ ఎంఎస్ చేసి, విశ్రాంతి తీసుకుంటున్నానని చెప్పండి.

కాలం మారింది. కాలం మారడంతోపాటు ఫోను కూడా చేతిలోకి వచ్చేసింది. అయితే ఆ ఫోను శృంగారానుభూతుల్ని పంచే పడక గదిలోకి కూడా వచ్చి రొద పెడితే మాత్రం భార్యకు చిర్రెత్తటం ఖాయం అంటున్నారు. సెక్స్‌కు సమాయత్తమై పరిస్థితి రసపట్టులో ఉన్న సమయంలో తలగడన పిచ్చి సంగీతపు కాలర్ ట్యూన్లతో కుయ్ కుయ్‌మనో...క్లింగ్ క్లింగ్‌మనో...డింగ్ డాంగ్‌మనో ఫోను చేసే శబ్దాలు శృంగార పట్టును నిస్సారం చేస్తాయి. కోరికతో రగిలే శరీరాలు గాలితీసిన బెలూన్లలా వాలిపోతాయి.

శృంగార జీవితాన్ని అద్భుతంగా మలుచుకునే చిట్కాల్ల్లో ఇవి కొన్ని...వారంలో కనీసం ఒక్కసారి భాగస్వామితో ఓ మంచి రొమాంటిక్ సినిమాను కలిసి చూడండి. ఆ సినిమాలోని కొన్ని శృంగారభరిత సన్నివేశాలు మనసులను రొమాంటిక్ మూడ్‌కి తెస్తాయి.

పడక గదికి చేరిన తర్వాత రోజువారీ భాగస్వామితో నెరపే శృంగార చేష్టల్లో ఒక కొత్తదనాన్ని చూపించండి. మీకు బాగా రొమాంటిక్ మూడ్స్‌ను తెప్పించే మంచి రొమాంటిక్ నవలలను ఎంచుకుని వాటిని కలిసి చదవండి. అయితే దీనికి పావుగంటకు మించి ఎక్కువ సమయం కేటాయించవద్దు.

కలిసి స్నానం చేయడం వల్ల శృంగార రాజ్యంలో సంతృప్తిని పొందవచ్చు. ఆదివారాలు కూడా పనితో సతమతమయ్యేవారు మీ భాగస్వామికోసం ఆఫీసుకు నెలలో కనీసం ఒక్కరోజు శెలవు పెట్టండి. ఆ రోజంతా మీ భాగస్వామిని శృంగారపు తాలూకు ఆనందాన్ని చవిచూపించడంలో నిమగ్నమవ్వండి. ఇటువంటి చిట్కాలు రొమాంటిక్ లైఫ్‌ను రసరమ్యంగా ఆస్వాదించేటట్లు చేస్తాయి.

Story first published: Wednesday, February 3, 2010, 17:34 [IST]

Get Notifications from Telugu Indiansutras