•  

అతడు-ఆమె: పడకగది సంభాషణ

Erotic communication
 
సంభోగమంటే సమభోగం అని అర్ధం. స్త్రీ పురుషులు సమానంగా ఆ ఆనందాన్ని అనుభవించాలన్నది ఉద్దేశం. సెక్స్ జీవితంలో మీకు కావలసిందంతా లభిస్తున్నదా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే దీనిలో మీరే కాదు మీ భాగస్వామి కూడా ఉన్నారు కాబట్టి. మనలో చాలా మందికి మంచి సంభాషణా చాతుర్యం ఉండదు. సెక్స్ కు సంబంధించిన కోరికలు, ఊహలకు సంబంధించి మాట్లాడడానికి మనలో చాలా మందికి ఆ మాటలే రావు. భాగస్వామి బాధ పడని రీతిలో వ్యక్తీకరించాల్సిన సెక్స్ భాషను అభ్యాసంతో సొంతం చేసుకోవచ్చు.

పడక గదిలో అభివ్యక్తీకరణ చాలా కష్టమైన విషయమే. మీ భాగస్వామి మనసుకు బాధ కలిగించని రీతిలో మాట్లాడి సెక్స్ కోరికలను తీర్చుకోవడం నిజంగా కళే. పడకగది వ్యవహారం యాంత్రికంగా మారిపోకుండా ఉండాలంటే మంచి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం.

పడకగది పని సామర్ధ్యం విషయంలో విమర్శలను ఎవరూ సహించరు. అతని శీఘ్రస్కలనమైనా కావచ్చు, ఆమె కు మూడ్ లేకపోవడమైనా కావచ్చు. వీటిని ప్రేమతో, చక్కటి మాటలతో, పరస్పర అవగాహనతో అధిగమించవచ్చు. మీకు ఇష్టమైన పని ఆమె అనుకోకుండా చేసిందనుకోండి, ఆ విషయం చెప్పి మీరెంత ఆనందపడ్డారో వ్యక్తీకరించండి. మీకు నచ్చని పని ఆమె చేసీందనుకోండి, ఆ విషయాన్ని ఆమెకు సున్నితంగా చెప్పండి. ఆమె కూడా అతనికి ఇటువంటీ విషయాలు చల్లగా, ప్రేమగా చెప్పాలి. పాజిటివ్ దృక్పథం జీవితంలోనే కాదు పడక గదిలో కూడా విజయాలను సిద్ధింపజేస్తుంది.

ఆమెకు ఉద్రేకం కలిగించి, కోరికలను రగిలించే స్పాట్స్ ఆమె శరీరంలో ఉంటాయి. ఆమె శరీరాన్ని వీణలా మీటుతూ అమె ఎక్కడ తాకితే బాగా స్పందిస్తున్నదో ఆమె హావభావాలను బట్టి సులభంగా గ్రహించవచ్చు. ఈ విషయంలో మీరే ఒక శాస్త్రవేత్త, మీరే ఒక వాస్కోడిగామా. అలాగే కొందరికి సెక్స్ సమయంలో పచ్చిగా మాట్లాడం బాగా ఇష్టంగా ఉంటుంది. భాగస్వామి అలా మాట్లాడితే వారిలో ఉద్రేకం తారస్ధాయికి చేరుకుంటుంది. అయితే భాగస్వామికి ఆ ఇష్టం ఉందో లేదో తెలుసుకుని వళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి. లేకపోతే వ్యతిరేక ఫలితాలు వచ్చి పడకగది రసాభాస అవుతుంది.

ఆర్ధిక విషయాలు, ఇతర కుటుంబ విషయాలు పడకగదిలో ప్రస్తావనకు రాకుండా జాగ్రత్త పడండి. మీరు సరస సంభాషణ మొదలు పెట్టినప్పుడు ఆమె కోపంగా ఉందా, ఆపేయండి, ఆమె లైట్ గా తీసుకుని నవ్విందా ఆపేయండి. సిగ్గుతో ఆమె బుగ్గలు మొగ్గలవుతున్నాయా, ఇక మాటలతో రెచ్చిపోండి. మరికొన్ని చిట్కాలు తదుపరి ఫీచర్ లో....

Story first published: Monday, January 25, 2010, 14:09 [IST]

Get Notifications from Telugu Indiansutras