శృంగారంలో కేవలం సంభోగం ద్వారానే పూర్తి ఆనందాన్ని పొందలేం. మహిళలను సంతుష్ఠులను చేయడానికి ఫోర్‌ప్లే అత్యంత కీలకం. పెదవులు, స్తనాలు, పిరుదులు, జననేంద్రియాలు మాత్రమే కాకుండా, మహిళల శరీరంలో అనేక సున్నితమైన భాగాలను సున్నితంగా స్పృశించడం ద్వారా గొప్ప ఆనందాన్ని అందించవచ్చు. ఇది శృంగారాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. మరి ఆ భాగాలేంటో ఇప్పుడు చూద్దాం.
శిరోజాలు: చాలా మందికి శిరోజాల ప్రాముఖ్యత తెలియదు. తలపై ఉండే వేల వెంట్రుకల కుదుళ్లలో సున్నితమైన స్పర్శ జ్ఞానం ఉంటుంది. లైంగిక చర్యలో ఉన్నప్పుడు, మీ వేళ్లను ఆమె జుట్టులోకి పోనిచ్చి, సున్నితంగా మసాజ్ చేయండి. అప్పుడు మీ భాగస్వామి పొందే ఆనందాన్ని మీరే చూడగలరు.

మోకాళ్ల వెనుక భాగం: మోకాళ్ల వెనుక ఉండే చర్మం చాలా సున్నితంగా స్పందిస్తుంది. భాగస్వామి స్కర్ట్ ధరించి ఉన్నప్పుడు, ఈ భాగంలో మీ వేళ్లతో సున్నితంగా స్పృశించండి. ఇది వారిలో మన్మథ లీలలను ఎలా ప్రేరేపిస్తుందో చూడండి.
తొడల లోపలి భాగం: మీ భాగస్వామి మంచి మూడ్‌లో ఉన్నప్పుడు, వారికి మరింత ఆనందాన్ని అందించడానికి తొడల లోపలి భాగాన్ని స్పృశించండి. దీనికి రెండు మార్గాలున్నాయి: మీ వేళ్లతో సున్నితంగా తాకవచ్చు లేదా నాలుకతో స్పృశించవచ్చు. ఈ రెండు పద్ధతులు వారిలో కామోద్రేకాన్ని కలిగించగలవు.
మోచేయి: పక్షి ఈకతో స్పృశించినంత సున్నితమైన స్పర్శను ఇవ్వాలనుకుంటే, మోచేతి భాగాన్ని మర్చిపోవద్దు. మోచేతి వెనుక భాగం అమ్మాయిలను ఉత్తేజపరిచే సున్నితమైన భాగాలలో ఒకటి.
పాదాలు: మీ భాగస్వామి అలసిపోయినప్పుడు, వారికి అత్యంత ఆనందాన్ని కలిగించే పని పాదాలకు మసాజ్ చేయడం. ఇది మొదట విశ్రాంతిని, ఆపై మంచి మూడ్‌ను ఇస్తుంది. అంతేకాదు, పాదాల మసాజ్ మీ పట్ల వారి హృదయంలో కృతజ్ఞతా భావాన్ని నింపుతుంది. ఈ సానుకూల భావన శృంగారానికి దారితీస్తుంది. ఈ స్పర్శకళలో నైపుణ్యం సాధించి, ప్రయోగించడం ద్వారా గొప్ప ఆనందాన్ని పొందవచ్చు.



Click it and Unblock the Notifications




