జిమ్‌కు వెళ్లే మహిళలు, జాగింగ్ చేసే మహిళలు రతిక్రీడలో అదరగొడుతారట. ప్రతి రోజూ వ్యాయామం చేసే మహిళలు శృంగారంలో ఆనందపుటంచులు చూస్తారని అంటున్నారు. తరుచుగా వ్యాయామం చేసే స్త్రీలలో కామోద్రేకం త్వరగా కలుగుతుందని, భావప్రాప్తి కూడా వేగంగా జరుగుతుందని అంటున్నారు.
శారీరకంగా చురుగ్గా మెసిలే మహిళల్లో రతిక్రీడకు సంబంధించిన చురుకుదనం కూడా ఉంటుంని ఫ్లోరిజా అట్లాంటిక్ విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ టీనా ఎం ఫెన్‌హొల్లో అంటున్నారు.
సింగిల్ స్ట్రెంగ్త్ వర్కవుట్ సందర్భంగా మహిళల దేహంలో గ్రోత్ హార్మోన్ అధిక స్థాయిలో విడుదలవుతుందని, అదే విధంగా కామవాంఛను రేకెత్తించే టెస్టోస్టిరోన్ విడుదల కూడా ఎక్కువ మోతాదాలు ఉంటుందని చెబుతున్నారు.
మరో అధ్యయనం
వ్యాయామం కామక్రీడపై చూపే ప్రభావంపై మరో అధ్యయనం కూడా జరిగింది. ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం ఈ అధ్యయనం చేసింది.
సైక్లింగ్ చేస్తే..
దాదాపు 20 నిమిషాల పాటు సైక్లింగ్ చేసి ఆ తర్వాత పోర్న్ చూసే మహిళల్లో సైక్లింగ్ చేయకుండా పోర్న్ చూసే మహిళల్లో కన్నా 169 శాతం అధికంగా కామవాంఛ రగులుకున్నట్లు ఆ అధ్యయనంలో తేలింది.
వ్యాయామం చేస్తే...
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే గ్రోత్ హార్మోన్, టెస్టోస్టిరోన్ విడుదల స్థాయిలు పెరుగుతాయి. దానివల్ల మహిళలు రతిక్రీడను ఆనందిస్తారని జైమైకా గ్లీనర్ రిపోర్టు చేసింది.
ఇలాంటి వారిలో ఎక్కువగా..
తరుచుగా వ్యాయామం చేసే మహిళల్లో సగటు మహిళల్లో కన్నా ఎక్కువగా కామవాంఛ ఉంటుందని అధ్యయనాల్లో తేలింది.