ఆరోగ్యకరమైన రతిక్రీడ మిమ్మల్ని ఉత్సాహపరుస్తుంది. కానీ, కొన్ని విషయాలు రతిక్రీడలోని ఆనందాన్ని తగ్గిస్తాయి. అంతేకాకుడా కామోద్రేకం తగ్గుతుంది. కామవాంఛ సన్నగిల్లి లైంగిక జీవితం దెబ్బ తింటుంది. లైంగిత జీవితాన్ని శారీరక, ఉద్వేగ, మానసికపరమైన పలు అంశాలు ప్రభావితంచేస్తాయి.
తమలోనో, తమ జీవిత భాగస్వామిలోనో లైంగిక వాంఛలు తగ్గుతున్నాయని చాలా మంది ఫిర్యాదు చేస్తుంటారు. మీ భాగస్వామి ఒత్తిడికి, మనస్తాపానికి, డిప్రెషన్‌కు గురై ఉండవచ్చు. లేదా మీతో దూరం పెరిగి ఉండవచ్చు.
కొన్ని భౌతికపరమైన సమస్యలు కూడా లైంగిక జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. కామోద్రేకం తగ్గడానికి అవి ప్రభావం చూపుతాయి. దానివల్ల లైంగిక జీవితం దెబ్బ తిన దాంపత్య జీవితంలో నిరాశ పేరుకుపోతుంది.

నిద్ర లేమి..
ఆరు లేదా అంతకన్నా తక్కువ గంటలు నిద్రపోతే లైంగిక వాంఛలు తగ్గి కామోద్రేకం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు. ఆరు గంటలు నిద్రపోయినా తగిన విధంగా అది లేకపోతే అది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.

గురక పెట్టడం..
ఇది విచిత్రంగానే అనిపించవచ్చు. మీ జీవిత భాగస్వామి గురక పెడితే మీ నిద్రకు భంగం వాటిల్లడమే కాకుండా కామోద్రేక స్థాయి క్రమంగా తగ్గుతూ వస్తుంది. గురక పెట్టడం వల్ల నిద్రను సరిగా పొందలేకపోవడమే కాకుడా శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురవుతాయి. దానివల్ల శరీరం లావెక్కుతుంది. అది కూడా లైంగిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

ఒత్తిడి, డిప్రెషన్
మానసిక ఒత్తిడి, డిప్రెషన్ వంటి వాటి వల్ల కామోద్రేకం తగ్తుతుంది. అది లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.

బరువు పెరగడం..
శరీరం లావెక్కితే కూడా లైంగిక జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుందని అంటున్నారు. ఫ్యాట్ సెల్స్ సెక్స్ హార్మోన్ల సమతుల్యతను దెబ్బ తీస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అనారోగ్యకరమైన జీవనశైలి..
స్మోకింగ్, డ్రింకింగ్ అలవాట్లు ఉన్న వ్యక్తుల్లో కూడా కామోద్రేక స్థాయి తక్కువగా ఉంటుంది. అనారోగ్యకరమైన అలవాట్లు లేని వారు శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండి, రతిక్రీడను ఆనందించగలుగుతారు.