లైంగిక ఉత్తేజాన్ని పెంచడానికి 1998లో వయాగ్రా వచ్చింది. వయాగ్రాతో కామోద్దీపనకు వాడే సంప్రదాయపద్ధతులు మూలన పడ్డాయి. లైంగిక ఉత్తేజాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషించే వయాగ్రా మనసుకు సంబంధించి మాత్రం మందు బిల్లనే. అలా కాకుండా దాన్ని ఐస్‌క్రీములో కలుపుకొని ఆస్వాదిస్తూ ఆరగించే వీలుంటే కామోద్దీపన పెరగడంతో ఉల్లాసం కూడా చోటు చేసుకుంటుంది.
బ్రిటన్‌కు చెందిన 'లిక్ మి! అయామ్ డెలీషియస్' అనే ఐస్‌క్రీమ్ కంపెనీ ఈ పనే చేసింది. ఆ కంపెనీ సెలబ్రిటీ వినియోగదారు కోరిక మేరకు ఒక్కో స్కూ ప్‌లో 25 మిల్లీగ్రాముల వయాగ్రా ఉండేలా ఒక సరికొత్త ఫ్లేవర్‌ను తయారుచేసింది.
ఇలా తయారుచేయాలని కోరిన సెలబ్రిటీ తమ ఐస్‌క్రీమ్ తిని ఫలితాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చినట్టు కంపెనీ తెలిపింది. ఈ ఐస్‌క్రీమ్ పేరు 'ద అరౌజల్'. దీని రూపకర్త చార్లీ హ్యారీ ఫ్రాన్సిస్. వయాగ్రానే కాదు, షాంపేన్ కూడా వాడారు.
కామోద్దీపనకు సువాసన..
ఇప్పుడు కామోద్దీపనకు వయాగ్రాను మరిచిపోవడానికి సరికొత్త ఐస్ క్రీమ్ అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్ కంపెనీ ఒక్కటి దీన్ని తయారు చేసింది.
దాని పేరు ద అరౌజల్..
బ్రిటన్క చెందిన లిక్ మీ, అయామ్ డెలిషీయస్ నే ఐస్ క్రీమ్ సంస్థ ఒక్కో స్కూప్లో 25 మిల్లీగ్రాముల వయాగ్రా ఉండే విధంగా ఐస్క్రీమ్ను తయారు చేసింది.
ఇదే మొదటిది కాదు..
ఇంతకు ముందు లండన్కు చెందిన 'ద ఐస్క్రీమిస్ట్స్' కంపెనీ కామోద్దీపనలు కలిగించే మూలికలతో ఇంతకుముందే 'సెక్స్బాంబ్ ఫ్లేవర్' పేరుతో ఓ ఐస్క్రీమును చాలా కాలంగా అమ్ముతోంది.
లేడీ గాగా పేరు మీద
ప్రముఖ గాయని లేడీగాగా పేరిట 'లేడీగాగా బ్రెస్ట్ మిల్క్ ఐస్క్రీమ్' అమ్మిన చరిత్ర ఆ కంపెనీకి ఉంది.
ఇలా చేస్తారు..
సాధారణంగా వైద్యులు ఎక్కువ మంది పేషెంట్లకు 50 మిల్లీగ్రాముల వయాగ్రా సిఫారసు చేస్తుంటారు. ఈ లెక్కన ఈ ఐస్క్రీము కొనేవారికి ఒక్కో కోన్కీ రెండు స్కూప్లు వేసిస్తారు. వయాగ్రా బిళ్ల లాగానే ఈ ఐస్క్రీమ్ స్కూపులు కూడా నీలిరంగులో నోరూరిస్తుంటాయి.