•  

ఆరోగ్యం అదరాలంటే సెక్సే మందు (పిక్చర్స్)

రతిక్రీడ కేవలం ఉల్లాసం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రదాయినిగా కూడా పనిచేస్తుందని పరిశోధనలో వెల్లడైంది. రతిక్రీడ క్రమం తప్పకుండా చేసేవారికి గుండె జబ్బులు దూరంగా ఉంటాయని చెబుతున్నారు.దంపతుల మధ్య మానసిక సాన్నిహిత్యం పెరిగి, దాంపత్య బంధం పటిష్టమవుతుందనే విషయం అందరికీ తెలిసిందే. రతిక్రీడ ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు. ఆరోగ్యంగా ఉండాలంటే క్రమం తప్పకుండా రతిక్రీడలో పాల్గొనాలని నిపుణులు చెబుతున్నారు.రతిక్రీడ ఆరోగ్యానికి చాలా ఉత్తమమైనదని పరిశోధకులు అంటున్నారు. గుండె జబ్బుల నుంచి దూరంగా ఉండాలనుకుంటే క్రమం తప్పకుండా రతిక్రియలో పాల్గొనాలని వారు సలహా ఇస్తున్నారు.గుండె జబ్బులు దూరం

గుండె జబ్బులు దూరం

నిత్యం రతిక్రియలో పాల్గొంటుంటే గుండె జబ్బులు దరి చేరవని మసాచుసెట్స్‌లోనున్న న్యూ ఇంగ్లాండ్ ఇన్స్‌టిట్యూట్‌కు చెందిన శాస్త్రజ్ఞులు తెలిపారు.

 

కనీసం వారంలో రెండు సార్లు

కనీసం వారంలో రెండు సార్లు

గుండె జబ్బులను నివారించేందుకు వారంలో కనీసం రెండు సార్లు రతిక్రీడలో పాల్గొంటుంటే పురుషుల్లో దాదాపు 45 శాతం మేరకు గుండె జబ్బులు తగ్గుతాయని పరిశోధకులు చెపుతున్నారు.

 

తక్కువైతే ఇలా..

తక్కువైతే ఇలా..

అదే వారానికి ఒకసారి లేదా అంతకంటే తక్కువగా రతిక్రీడలో పాల్గొనేవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాట్టు పరిశోధకులు హెచ్చరించారు.

 

పరిశోధన ఇంత మందిపై

పరిశోధన ఇంత మందిపై

తమ పరిశోధనలకు 40 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలలోపు కలిగిన వ్యక్తులు దాదాపు వెయ్యిమందిని పరీక్షించినట్లు పరిశోధకులు తెలిపారు. వీరిని 16 సంవత్సరాలపాటు పరీక్షించి పరిశోధించినట్లు శాస్త్రజ్ఞులు తెలిపారు.

 

ఇలా తేలింది..

ఇలా తేలింది..

క్రమ తప్పకుండా తమ భాగస్వామితో రతిక్రీడలో పాల్గొన్నవారిలో గుండెకు సంబంధించిన వ్యాధులు జాడే కనిపించలేదని వారు చెప్పారు.

 

 సరస సల్లాపాలు కూడా..

సరస సల్లాపాలు కూడా..

తమ జీవిత భాగస్వామితో నిత్యం ప్రేమ కలాపాలు కొనసాగిస్తూ ప్రేమపూర్వకమైన సంభాషణలు, నిత్యం చిలిపి చేస్టలు కొనసాగించే వారు యవ్వనంగా కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.

 

వృద్ధాప్యపు ఛాయలు తక్కువ..

వృద్ధాప్యపు ఛాయలు తక్కువ..

తమ జీవిత భాగస్వామితో నిత్యం ప్రేమ కలాపాల్లో తేలిపోతూ సరసాలు సాగిస్తూ ఉండేవారిలో వృద్ధాప్యపు ఛాయలు కనిపించలేదని పరిశోధకులు తేల్చారు.

 

 

English summary

 According to a research - sexual activity will keep away the heart diseases and will help to save from ill health.
Story first published: Tuesday, March 4, 2014, 16:49 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras