పెళ్లయిన కొత్తలో ఉండే హుషారు ఆ తర్వాత ఉండదు. దంపతుల మధ్య ఆకర్షణ తగ్గుతుంది. అందుకే, కొంతమంది దంపతులు తమకు తగినంత లైంగిక ఆనందం కలగడం లేదనీ, అసలు తన భాగస్వామిని ఎంత ప్రేరేపించినా సెక్స్ స్పందనలు కలగడం లేదని ఫిర్యాదులు చేస్తుంటారు.
నిజానికి ఇది లైంగిక పరమైన సమస్య కాదు. దాని వెనక ఇతర సమస్యలు అయి ఉంటాయి. ఒకరు సెక్స్‌కి సిద్ధపడి రెండోవారు అది ఇప్పుడు ఇష్టం లేదని అంటున్నారంటే, దాని వెనుక మరేదో సమస్య ఉందని అర్థం చేసుకోవాలి.
శృంగారానికి భార్య సహకరించడం లేదని చాలా మంది పురుషులు ఫిర్యాదు చేస్తుంటారు. మహిళలకు కూడా ఇటువంటి ఫిర్యాదులు ఉండవచ్చు గానీ వారు బయటపడిన సూచనలు కనిపించవు. తమ లైంగిక అసంతృప్తిని వారు ఇతర రూపాల్లో వ్యక్తం చేస్తుంటారని నిపుణులు అంటారు. దాన్ని పరిష్కరించుకుని లైంగిక క్రీడను నిత్యనూతనంగా సాగిస్తేనే దాంపత్య జీవితం కూడా సుఖమయంగా ఉంటుంది.

పడక గదిలోకి చేరాక..
పడక గదికి చేరిన తర్వాత మనసులో శృంగారపరమైన కోరికలు తప్ప మరే కోరికలకు చోటు కల్పించకూడదు. అలా ఉండటానికి ఇద్దరూ ప్రయత్నించాలి.

సమస్యలుంటే బయటే..
ఏవైనా సమస్యలుంటే పడక గది బయటే చర్చించుకుని వాటిని అక్కడే వదిలేయాలి. ఆ సమస్యలను చర్చించేందుకు పడకగదిని వాడుకోకూడదు. ఆనందకరమైన, సంతృప్తికరమైన లైంగిక క్రీడ అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.

స్పర్శను ఎంచుకోండి...
భాగస్వామిలో కామోద్రేకాన్ని రేపేందుకు ఎక్కడ స్పర్శిస్తే ఆమె/అతడిలో స్పందన వస్తుందో తెలుసుకుని సున్నితంగా స్పర్శిస్తూ ప్రారంభించండి. అలా నెమ్మదిగా వారిని సెక్స్కి సంసిద్ధులను చేసి పూర్తి స్థాయి రతిక్రీడకు తీసుకుని వెళ్లవచ్చు.

శృంగారపరమైన కబుర్లు..
శృంగారపరమైన కబుర్లను చెప్పడం కూడా లైంగికపరమైన కోర్కెలకు ద్వారాలను తెరువవచ్చు. సెక్స్ తృప్తి అనుభవించిన జంటల్లో మానసిక ఆందోళనలు కానరావు. అంతేకాదు పూర్తి ఆరోగ్యానికి కూడా సెక్స్ మంచి మందు అంటున్నారు నిపుణులు.

వేరే విషయాలు మాట్లాడవద్దు..
భాగస్వామిని నొప్పించే మాటలు పడకగదిలో మంచివి కావు. భాగస్వామి బలహీనతల గురించి ఆ సమయంలో మాట్లాడడం వల్ల పూర్తిగా నీరసపడిపోయే ప్రమాదం ఉంది.