లైంగిక జీవితం బాగుంటే దాపంత్య సుఖం దక్కుతుంది. దంపతుల మధ్య సామరస్యవూరిత వాతావరణం నెలకొంటుంది. రోజంతా ఉల్లాసంగా పనిచేసుకుపోగలరు. రతిక్రీడ మనుషుల్లో మానసిక ఒత్తిడితి తగ్గించడమే కాకుండా శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.
అయితే, దాని వల్ల మరో లాభం ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని చెబుతున్నారు. మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు లైంగిక క్రీడ ఉపయోగపడుతుదని తాజా పరిశోధనలో తేలింది.
హిప్పో క్యాంపస్ దీర్ఘకాలిక జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. అందువల్ల రతిక్రీడపై విసుగు చెందకుండా, దానిపై విరక్తి పెంచుకోకుండా చూసుకోండి. రతిక్రీడను అదరగొట్టి జ్ఝనాన్ని పొందండి.
జ్ఞాపకశక్తి పెరగలేదు..
ఎలుకలకు కొత్త న్యూరాన్లు పెరిగినా లైంగిక కార్యకలాపం లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయం వైద్యనిపుణులు వెల్లడించారు.
ఆక్సిజన్ చేరుతుంది..
లైంగిక క్రీడ సాగించడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దానివల్ల బుద్ధి వికసిస్తుందని చెబుతున్నారు.
దక్షిణ కొరియాలోనూ...
దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయం చేసిన పరిశోధనలో కూడా బలమైన సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పో క్యాంపస్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి ఆవిర్భవిస్తాయని వారు తేల్చారు.
న్యూరాన్లే ఉపయోగపడుతాయి..
తీవ్రమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, దాన్ని తగ్గించడానికి న్యూరాన్లు ఉపయోగపడుతాయి. దానివల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
లేటు వయస్సులో కూడా..
లేటు వయస్సులో కూడా రతిక్రీడను ఆస్వాదించేవారికి మతిమరుపు దరికి చేరదని, డిమెన్షియా కూడా చెంతకు చేరదని శాస్త్రవేత్తలు తేల్చారు.