•  

రతిక్రీడ: ఆసక్తి తగ్గుతోందా, ఎలా? (పిక్చర్స్)

ఆధునిక జీవితం సంక్లిష్టంగా మారిపోయింది. పొద్దున లేస్తే ఉరుకులు పరుగులే. క్షణం తీరిక లేకుండా దైనందిన వ్యవహారాల్లో పడిపోవడం వల్ల దంపతుల్లో రతిక్రీడ పట్ల ఆసక్తి తగ్గిపోతోందని అంటున్నారు. దానివల్ల ఆరోగ్యంపై తీవ్రమైన పడుతున్నట్లు చెబుతున్నారు.



శృంగారంపై ఆసక్తి తగ్గిపోవడంతో లైంగిక క్రీడను మొక్కుబడిగా సాగించే స్థితికి వచ్చినట్లు చెబుతున్నారు. దాంతో దాంపత్య జీవితాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నట్లు చెబుతున్నారు. ఇరువురి సంబంధాలపై తీవ్రమైన ప్రభావం పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు.



ఇది మరింత విషమిస్తే అంతకుమించిన నరకం ఇంకొకటి లేదని సెక్స్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేచింది మొదలు తిరిగి ఇంటికి వచ్చి కాస్త తిని పడుకునేంత వరకు క్షణం తీరిక లేని బిజీ లైఫ్‌తో దంపతుల మధ్య లైంగిక సంబంధాలు దారుణంగా దెబ్బతింటున్నాయని సర్వేల్లో తేలింది.



సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వల్ల కూడా..

సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ వల్ల కూడా..

 

సాఫ్టవేర్ బూమ్ వల్ల, ఇతర వృత్తుల్లో మితిమీరిన పోటీతత్వం వల్ల, నిత్యం పనిలో పెరుగుతున్న ఒత్తిడి వల్ల భార్యాభర్తలు రోజులో కలిసి ఉండే సమయం తగ్గుతోంది. దీంతో వారిరువురి మధ్య అనుబంధం గట్టిపడడం లేదని చెబుతున్నారు.

 

కలిసి ఉండే సమయం ఏది..

కలిసి ఉండే సమయం ఏది..

 

భార్యాభర్తలిద్దరు ఉద్యోగాలు చేస్తుండడంతో ఇరువురు తమ సమస్యలను, సంతోషకర క్షణాలను పంచుకునే సమయం క్రమంగా తగ్గిపోతున్నట్లు సర్వేలు తెలియజేస్తున్నాయి.

 

ఓ సర్వేలో ఇలా..

ఓ సర్వేలో ఇలా..

 

రోజులో తాము కలిసి ఉండే సమయం కేవలం 15 నిమిషాలు మాత్రమేనని ఇటీవల బ్రిటన్‌లో దంపతుల సమయంపై జరిగిన ఓ సర్వేలో రోజు పలువురు చెప్పారు.

 

ఆధునిక ప్రపంచంలో..

ఆధునిక ప్రపంచంలో..

 

పని ఒత్తిడి, విశ్రాంతి సమయం తగ్గడంతో లైంగిక జీవితంలో జడత్వం చోటు చేసుకుంటోంది. దీంతో ఐరోపా, అమెరికాలో, జపాన్ తదితర పారిశ్రామిక దేశాల్లో సంతానోత్పత్తి కరువై జనాభా పెరుగుదల తగ్గినట్లు లెక్కలు చెబుతున్నాయి.

 

ఆసియా దేశాలు నయమే..

ఆసియా దేశాలు నయమే..

 

జడత్వం కారణంగా సంభవించే దుష్పరిణామాలు ఆసియా దేశాలకు ఇప్పటికిప్పుడే వర్తించక పోయినా దంపతుల జీవితంలోని అతి ముఖ్యభాగమైన లైంగిక సంబంధాలు తగ్గిపోతున్నాయని తేలింది. ఇది హెచ్చరికలాంటిదే.

 

పొద్దున వెళ్తే, తిరిగి ఎప్పుడో..

పొద్దున వెళ్తే, తిరిగి ఎప్పుడో..

 

ప్రస్తుత ఆధునిక సమాజంలో ప్రతిరోజూ ఉదయం 9 గంటలకు ఇంటినుంచి బయటపడితే రాత్రి ఓ పదికో పదకొండుకో ఇంటికి చేరడం అనేది ఆనవాయితీగా మారింది. ఆఫీసులో పని గంటలు, ప్రయాణాలు కలుపుకుని చూస్తే పరిస్థితి అలాగే ఉంది.

 

తీరికే లేదు, ఇంకెలా..

తీరికే లేదు, ఇంకెలా..

 

మంచి సంగీతాన్ని ఆస్వాదించేందుకు, మంచి పుస్తకం చదివేందుకు, మార్కెట్‌కు వెళ్లి వాటిని తెచ్చుకునేందుకు కూడా సమయం చిక్కడం లేదు. వారంతాలు కూడా ఇలాగే కరిగిపోతున్నాయి.

 

షిఫ్టుల గోల..

షిఫ్టుల గోల..

 

ఇద్దరు ఉద్యోగాలు చేస్తుంటే, భర్త ఓ షిఫ్టులో భార్య మరో షిఫ్డులో కార్యాలయాలకు వెళ్లే పరిస్థితి. ఒకరు ఇంటికి వస్తే, మరొకరు ఆఫీసుకు వెళ్లే పరిస్థితి. ఇద్దరు కలుసుకుని ఒకరినొకరు చూసుకునే సమయాలు పూర్తిగా తగ్గిపోతున్నాయి. ఇది రతిక్రీడపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది.

 

గాడ్జెట్లూ తినేస్తున్నాయి.

గాడ్జెట్లూ తినేస్తున్నాయి.

 

అదృష్టవశాత్తు కాస్తా సమయం చిక్కితే మన ఇంట్లో, మన చుట్టూ వచ్చి పడుతున్న హైటెక్ గాడ్జెట్లతో మన అనుబంధం పెరుగుతోంది తప్ప దంపతులు కలిసి మాట్లాడుకునే పరిస్థితి కూడా ఉండడం లేదు. ఒకరు టీవికి అతుక్కుపోతే, మరొకరు సిస్టమ్‌కు కరుచుకుపోవడం జరుగుతోంది.

 

అప్రమత్తం కాకపోతే కష్టమే..

అప్రమత్తం కాకపోతే కష్టమే..

 

ఆధునిక జీవితంలోని అవాంఛనీయమైన పరిస్థితులను ఓ కంట కనిపెడుతూ ఇరువురు కలిసి కాలక్షేపం చేసే సమయాలను, తేదీలను నిర్ణయించుకోవాలి.

 

 



English summary
Sexual desire is decreasing with the modern day life affecting the relation between the couple adversly.
Story first published: Tuesday, January 28, 2014, 15:05 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras