•  

సెక్స్: ఉద్వేగంతో ఊగిపోతేనే.. (పిక్చర్స్)

గతంలో చాలా కుటుంబాల్లో శృంగారం అనే పదం వాడడం తప్పుగా ఉండేది. కానీ పరిస్థితులు మారాయి. కాలానుగుణంగా సెక్స్ విషయంలోనూ మార్పులు వచ్చాయి. సెక్స్‌లో పాల్గొనడం వల్ల స్త్రీపురుషులకు ఎనలేని ప్రయోజనాలు కలుగుతాయి. తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్న వారు శృంగారంలో పాల్గొన్నట్టయితే మానసిక ప్రశాంతత పొందుతారని చెపుతున్నారు. అంతేకాదు శృంగారం వల్ల మనిషికి కలిగే సంతోషం అవధుల్లేనిదంటున్నారు.



పెళ్లి తర్వాత సెక్స్ అనే అంశాన్ని మన దేశంలో సరదా విషయం కింద కొట్టిపారేసేవారు. పెళ్లయిన తర్వాత సెక్స్ గురించి దంపతులు నేర్చుకోవలసిన పనిలేదనే అభిప్రాయం మన సమాజంలో బలంగా ఉండేది. అయితే ఇప్పుడు ఇది తీవ్రమైన సమస్యగా మారింది. ఎందుకంటే సెక్స్ అనేది పెళ్ళి, ప్రేమ, ఆరోగ్యం వంటి విషయాలతో లోతుగా ముడిపడి ఉంది. పైగా దాంపత్య సంబంధాన్ని నిర్ణయించే ప్రధానాంశంగా సెక్స్ మానవ జీవితంలో చిరకాలం నుంచి కొనసాగుతోంది.



ఆ విషయాలకు మనిషి ఎప్పుడైతే ప్రాముఖ్యత ఇవ్వడం ఆపివేస్తాడో అప్పుడే వైవాహిక జీవితంలో లైంగిక సమస్యలు ముసురుకుంటాయి. ఇవి దంపతుల అభిప్రాయాలు, వ్యక్తిత్వం అనే వాటి మీద పూర్తిగా ఆధారపడి ఉంటాయని అంటున్నారు. జీవిత భాగస్వాములైన ఇరువురి అభిరుచులు, వ్యక్తిత్వాలపై మాత్రమే ఇది ఆధారపడి ఉంటుంది.



గుండె జబ్బులకు దూరం..

గుండె జబ్బులకు దూరం..

 

రతిక్రీడలో సంతృప్తిగా పాల్గొనే మహిళలకు గుండె సంబంధిత వ్యాధులు రావని తేలింది. అలాగే మహిళలలో ప్రసవ నొప్పులను తగ్గించి, బాలింతలలో పాలను వృద్ధి పరిచేందుకు దోహదపడే ఆక్సిటోసిన్ హార్మోన్ దాంపత్య సుఖాన్ని పూర్తి స్థాయిలో అనుభవించేవారిలో అధికంగా ఉన్నట్లు అధ్యయనాలు చెపుతున్నాయి.

 

ఆరోగ్యానికి మంచిది..

ఆరోగ్యానికి మంచిది..

 

వారానికి రెండుసార్లు సెక్స్‌లో పాల్గొనే పురుషులలో గుండెపోటు సమస్య సగానికి సగం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

 

దాంపత్య సమస్యలు తక్కువ

దాంపత్య సమస్యలు తక్కువ

 

శృంగార సుఖాన్ని అనుభవించే జంటల్లో దాంపత్య సమస్యలు తలెత్తే అవకాశం చాలా తక్కువగా ఉటాయి.

 

నిర్లక్ష్యం కూడదు..

నిర్లక్ష్యం కూడదు..

 

పెళ్లి తర్వాత లైంగిక సమస్యలు నిర్లక్ష్యం చేయకూడదు. భాగస్వామి గురించి ఆలోచించేవారెవరూ దాన్ని నిర్లక్ష్యం చేయరని అంటారు.

 

దాంపత్య జీవితానికి అవరోధం..

దాంపత్య జీవితానికి అవరోధం..

 

అంగస్తంభన సరిగా కాకపోవడం, హార్మోన్ల అసమతుల్యత, కామవాంఛ నశించడం, సెక్స్‌లో భావప్రాప్తికి ముందే నీరుగారిపోవడం వంటివి దాంపత్య జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.

 

పటిష్టతకు మార్గం వేస్తుంది

పటిష్టతకు మార్గం వేస్తుంది

 

చురుకైన లైంగిక జీవితం దంపతుల మధ్య సంబంధాలను పటిష్టం చేస్తుంది. రోజువారీ సమస్యలు భార్యాభర్తల సంబంధాలను దెబ్బతీయకుండా ఉండాలంటే లైంగిక సంబంధం భార్యాభర్తల మధ్య సజావుగా ఉండాలి.

 

వదిలించుకోవాల్సిందే..

వదిలించుకోవాల్సిందే..

 

పడకగదిలో సమస్యలు తలెత్తుతున్నాయంటేనే వాటిని త్వరగా వదిలించుకోవాల్సి ఉంటుంది. లైంగిక సమస్యలను గురించి క్రమం తప్పకుండా చర్చించుకుంటేనే దాంపత్య జీవితం సజావుగా సాగుతుందని నిపుణులు చెపుతున్నారు.

 

 

English summary

 Couple should undersatnd the basic problems of sexual life by discussing each other.
Story first published: Wednesday, January 29, 2014, 14:48 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras