•  

సెక్స్: ఆ తర్వాత ఆమె రెచ్చిపోవాలంటే (పిక్చర్స్)

ఓ బిడ్డను కన్న తర్వాత మహిళ మెదడులో తీవ్రమైన మార్పులు సంభవిస్తాయి. శారీరకంగా, మానసికంగా ఆ మార్పులు కొట్టొచ్చినట్లు కనిపిస్తాయి. హార్మోన్ల విడుదలలో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. బిడ్డను కన్న వెంటనే పురుషుడితో సాంగత్యానికి మహిళ సుముఖత వ్యక్తం చేయదు. అయితే, భర్తతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవాలంటే అది తప్పదు.



రతిక్రీడకు ఆమెకు ఏర్పడే ప్రధాన ఆటంకం బిడ్డను చూసుకోవాల్సి రావడం. బిడ్డకు ఎప్పుడూ తాను అందుబాటులో ఉండాలనే తాపత్రయం. అవి ఆమెను పురుషుడికి దగ్గర కాకుండా చేస్తాయి. హార్మోన్ల ప్రభావం వల్ల కూడా పురుషుడితో శారీరక సాంగత్యానికి అంతగా ఆసక్తి కనబరచదు.



అయితే, రోమాన్స్ అనేది భార్యాభర్తల మధ్య బంధాన్ని పటిష్టం చేస్తుంది. శృంగారానికి మహిళ దూరంగా ఉంటే పురుషుడు విసుగు చెంది, వక్రమార్గాలు పట్టే ప్రమాదం ఉంది. అందువల్ల పురుడు పోసుకున్న తర్వాత శృంగారాన్ని మధురానుభూతిగా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది.



నెమ్మదిగా...

నెమ్మదిగా...

 

పురుడు పోసుకున్న తర్వాత భర్తతో రతిక్రీడ విషయంలో దూకుడుగా వ్యవహరించకూడదు. నెమ్మదిగా చేయాలి. పురుడు వల్ల పుట్టిన నొప్పులన్నీ తగ్గాల్సిన అవసరం ఉంటుంది. దూకుడుగా వ్యవహరిస్తే ఆ నొప్పులు తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. అన్ని నొప్పులూ తగ్గి సాధారణంగా మారిన తర్వాతనే సెక్స్‌లో పాల్గొనాలని వైద్యులు చెబుతారు.

 

నొప్పులు తగ్గాల్సిందే..

నొప్పులు తగ్గాల్సిందే..

 

నొప్పులు తగ్గడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతుంది. కుట్లు పడితే సాధారణం కన్నా ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుంది. మహిళ తాను గట్టిపడినట్లు భావిస్తే రతిక్రీడకు ఉపక్రమించవచ్చు.

 

చెప్పేస్తే మంచిది..

చెప్పేస్తే మంచిది..

 

మహిళ తాను ఎదుర్కుంటున్న ఇబ్బందుల గురించి తన పురుషుడితో మాట్లాడితే మంచిది. మీకు ఎలా బావుంటుందో అతనితో చెప్తే మంచిది. దానివల్ల అతను మిమ్మల్ని అర్థం చేసుకునే వీలుంటుంది.

 

బాడీలో మార్పులు...

బాడీలో మార్పులు...

 

ఒక్కసారి బిడ్డను కన్న తర్వాత శరీరంలో చాలా మార్పులు వస్తాయి. పొట్ట కాస్తా లావు కావచ్చు.. వక్షోజాల బిగుతు కాస్తా తగ్గవచ్చు. తక్కువ కామవాంఛ ఉండవచ్చు. వాటిని సహనంతో అంగీకరించి, రతిక్రీడపై మనసు లగ్నం చేస్తే ఆనందాన్ని అందుకోగలరు.

 

ఆరోగ్యం జాగ్రత్త...

ఆరోగ్యం జాగ్రత్త...

 

ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఆరోగ్యకరమైన, సమతుల్యమైన ఆహారం భుజించడం అలవాటు చేసుకోవాలి. శరీర పటుత్వానికి యోగా చేస్తే మంచిది. పోషకాహారం చాలా అవసరం. బిడ్డకు పాలు ఇస్తున్నందున కాస్తా విశ్రాంతి తీసుకుని సరిగా నిద్రపోవడం అవసరం. దానివల్ల చాలా త్వరగా మీలో కామవాంఛలు తిరిగి విజృంభిస్తాయి.

 

మీ పురుషుడితో గడపండి..

మీ పురుషుడితో గడపండి..

 

శారీరక సాంగత్యం లేకున్నా మీ పురుషుడితో ఒంటరిగా కొంత సమయం గడిపేందుకు ప్రాధాన్యం ఇవ్వండి. దానివల్ల సాన్నిహిత్యం పెరుగుతుంది. సెక్స్‌లో పాల్గొన్నప్పుడు నొప్పిగానే, ఇబ్బందిగానో ఉంటే మీ భాగస్వామికి చెప్తే అతను సర్దుకుంటాడు.

 

ఇలా చేయవచ్చు..

ఇలా చేయవచ్చు..


నొప్పులు పూర్తిగా తగ్గకపోతే, సంభోగానికి సమయం కాదనుకుంటే అతన్ని దూరం పెట్టకుండా ముద్దులతో, కౌగిలింతలతో అతనితో బాంధవ్యాన్ని పెంచుకోండి. అతను మీ ప్రేమకు మురిసిపోతాడు. మీతో బంధాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి ఇష్టపడుతాడు. అతను, మీరు మీ శరీరాంగాలతో ఆడుకుంటూ తృప్తి పడవచ్చు.

మిమ్మల్ని మీరు..

మిమ్మల్ని మీరు..

 

మీ బిడ్డ పడుకున్నప్పుడు, మీకు సమయం చిక్కినప్పుడు మిమ్మల్ని మీరు సంతోషపెట్టుకునే పనులు చేయండి. మీ భాగస్వామితో గడపండి. మీరు రిలాక్స్‌గా కనిపిస్తే అతనికి ఆనందంగా ఉంటుంది.

 

ఇలా చేయవచ్చు..

ఇలా చేయవచ్చు..

 

మీ పురుషుడు బయటకు వెళ్లినప్పుడు చిలిపి మెసేజ్‌లు పంపండి. ఫోన్‌లో మాట్లాడి అల్లరి చేయండి. అతని పాకెట్లో అతనికి తెలియకుండా ప్రేమసందేశాలు రాసి పెట్టండి. సాయంత్రం పూట అవే అతన్ని మీ చెంతకు చేరుస్తాయి.

 

 

English summary
Post pregnancy, women's body and mind goes through multiple changes – physical, emotional and hormonal. It is difficult to get back to her daily life soon after she delivers. sex is also important to strengthen her bond with her life partner.
Story first published: Tuesday, December 10, 2013, 16:04 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras