స్త్రీపురుషులిద్దరు కామోద్రేకంతో రగిలిపోతేనే ఇరువురికి రతిక్రీడలో సంతృప్తి కలుగుతుంది. ఎలా చేస్తే మహిళకు కామోద్రేకం కలుగుతుంది, ఎలాంటివి కామోద్రేకాన్నిచల్లబరుస్తాయనే విషయాలను పురుషుడు తెలుసుకోవాలి. ఒకరికి ఇష్టమైన విషయాలు మరొకళ్ళకు ఇష్టం కాకపోవచ్చు. శృంగారం పూర్తిగా వ్యక్తిగతమైంది. భాగస్వామి ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలంటే ముఖ్యమైంది సమాచారం వినిహమయ‌. బిడియాలు వదిలేసి ఇరువురు మాట్లాడుకుంటే రతిక్రీడ ఆహ్లాదకరంగా ఉంటుంది.
సాధారణంగా శృంగార సమయంలో కాకుండా ఇతర సమయాలలో తమకు ఇష్టమైనవాటిని, ఇష్టంలేని వాటిని వ్యక్తంచేస్తే మంచిది. శృంగార సమయంలో వ్యక్తం చేయడం వల్ల పురుషుడిలో కామవాంఛ, కామోద్రేకం చల్లారిపోవచ్చు. ఫోర్‌ ప్లే ఎక్కువసేపు చేయడం వల్ల స్త్రీకి ఉద్రేకాన్ని కల్గించే అంశాలు గూర్చి తెలుసుకునే అవకాశం మగవానికి కలుగుతుంది.
వాత్స్యాయన కామసూత్రాలలో వర్ణించిన చుంబన ఆలింగనాదులన్నీ స్త్రీకి అత్యంత కామోద్రేకాన్ని కలిగించేవి. సందర్భాన్ని బట్టి రతిక్రీడ ఆనందాన్ని కలిగిస్తుంది. ఎక్కువసేపు, తక్కువసేపు అనేదానితో ప్రమేయం లేకుండా ఉత్కంఠభరితమైన రతిక్రీడ ఆనందాన్ని కలిగిస్తుంది. థ్రిల్ కలుగుతుంది.
ఎక్కువసేపు, తక్కువసేపు..
శనివారం రాత్రి ఎక్కువసేపు శృంగారంలో పాల్గొన్నప్పుడు ఒకలాంటి తృప్తి కలుగుతుంది. తెల్లారి ఆదివారం సెలవు కాబట్టి శనివారం రాత్రి ఎక్కువ సేపు రతిక్రీడను ఆస్వాదించవచ్చు. అదే సోమవారం ఉదయం లేదా వర్కింగ్ డేస్ బిజీగా ఉన్నప్పుడు శృంగారంలో పాల్గొన్నా అదో రకమైన ఆనందాన్ని ఇస్తుంది. దేని ఆనందం దానిదే.
ఆలోచనలే ముఖ్యం..
రతిక్రీడ జరిపే సమయంలో శృంగారం తప్ప ఇతర ఆలోచనలు ఆ సమయంలో చేయకపోతే ఉర్రూతలూగే రతిక్రీడను సాగించవచ్చు. అలాంటి ఆలోచనలు రానీయకపోవడం వల్ల రతిక్రీడ మీద ఇద్దరి దృష్టి నిలిచిపోయి మన్మథ సామ్రాజ్యాన్ని పాలిస్తారు.
మహిళ పాత్ర తక్కువే..
మహిళకు అన్ని సమాజాల్లోనూ సమానస్థాయిలు లేవు. వారి చదువు, సామాజిక హోద, శృంగారంలో పాత్ర వంటి పలు విషయాల్లో మహిళను తక్కువ చేసి చూశారు. దాని వల్ల శృంగారానికి సంబంధించిన భావనలు మహిళ స్వేచ్ఛగా వెల్లడించలేని పరిస్థితి ఉంది. దాని స్థానంలో బిడియం చోటు చేసుకుంది. ఈ బిడియాన్ని వదిలేసి పురుషుడితో సమానంగా ఆమె శృంగారాన్ని ఆస్వాదించడానికి సిద్ధమైతే ఇరువురికి ఆనందం కలుగుతుంది.
స్త్రీలకూ కామసూత్రాల గ్రంథం
శృంగారానికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని మహిళకు కూడా అందించడం అవసరం. వాత్స్యాయనుడు తన కామసూత్రాల్ని ముఖ్యంగా స్త్రీలు చదవాలని చెప్పాడు. కానీ పురుషులు దాన్ని మహిళకు దూరంగానే పెట్టారు.
మహిళల్లో అదే భావన..
కామసూత్రాలలాంటి గ్రంథాలు చదవాల్సిన అవసరం గానీ, భర్తతో శృంగారంలో సమాన స్థాయిలో పాల్గొనాల్సిన అవసరం గానీ తమకులేదని మహిళలు అనుకుంటారు. తాము పురుషుడికి రతిక్రీడలో ఆనందాన్ని కలిగించాల్సినవారమని మాత్రమే అనుకుంటారు. కానీ, సమాజం మారుతున్న కొద్దీ ఆలోచనలు మారుతున్నాయి.
దాన్నేమంటారు..
మహిళ ఏ విధంగానూ ఎప్పుడూ భావప్రాప్తి పొందకపోవడాన్ని ''ప్రాథమిక భావప్రాప్తి లోపం'' అంటారు. శృంగార వ్యతిరేక విశ్వాసాలు దీనికి ప్రధాన కారణం. కొందరు స్త్రీలు చిన్నప్పటినుంచీ శృంగారంపై ఒక విధమైన వ్యతిరేక భావం, అసహ్యభావం కలిగి ఉంటారు.