ముద్దంటే చేదా అనే ఓ సినిమాలో కథానాయిక కథానాయకుడిని అడుగుతుంది. స్త్రీపురుషుల మధ్య ముద్దుల ముచ్చెటకు పెద్ద కథే ఉంది. ఇరువురి దేహాల మధ్య కెమిస్ట్రీ ముద్దులతో మొదలవుతుంది. ముద్దుల్లో రకరకాల ముద్దులున్నా ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ముద్దంటే ఇష్టం.
ముద్దులతో ముంచెత్తి ముగ్గులోకి లాగడానికి పురుషుడికి తన మహిళ మనోభావాల పసిగట్టే నేర్పు ఉండాలి. కోపం వస్తే ముద్దు పెట్టి మురిపెం చేసి బుజ్జగించవచ్చు. తన పురుషుడు కోపంగా ఉన్నప్పుడు అతని పెదవులను మహిళ తన పెదవులతో బంధిస్తే వెంటనే ఐసైపోతాడు.
రతిక్రీడలో జ్వాలలు రేపాలంటే ముద్దులతో మొదలు పెట్టాలి. పెదువులతో పెదవులను బంధించడం అందులో ముఖ్యమైంది. ముద్దు పెట్టుకోవడం కూడా ఓ కళే. పెదవులతో పెదవులను ముద్దు పెట్టుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలి.

దగ్గరా వెళ్లి..
ముద్దుకు ఆమెను సుముఖం చేసుకోవడానికైనా, ఆమె ముద్దు పెట్టించుకోవడానికి ఇష్టంగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవడానికైనా ఓ టెక్నిక్ ఉంది. ఆమెకు చాలా దగ్గరగా వెళ్లాలి. ఆమె మీ కళ్లలో మీపై ఇష్టం స్పష్టంగా కనిపిస్తేనే ముందుకు సాగాలి. మరోటి కూడా ఉంది. ఆమె దగ్గరగా వెళ్లి జుట్టును సరి చేస్తూ పోవాలి. అలా మెల్లగా ఆమె ముద్దుకు ముచ్చట పడుతుంది.

దుర్వాసన లేకుండా చూసుకోవడం..
మహిళను ముద్దు పెట్టుకునే సమయంలో మీ నోరు దుర్వాసన వెదజల్లకుండా చూసుకోవాలి. లేదంటే మొదటికే మోసం వస్తుంది. మీ నోరు ఆరోగ్యకరంగా ఉంటే, ఆమెను గట్టిగా పెద్దవులతో బంధించడమే కాకుడా ఆమె నాలుకను మీ నోటిలోకి తీసుకుని జుర్రుకోవచ్చు. ఆమె పెదవులను కొరికేయవచ్చు కూడా..

ఆమె శ్వాసను పట్టించుకోవాలి..
ముద్దు పెట్టుకున్నప్పుడు మీ మహిళకు శ్వాస ఆడే విధంగా చూసుకోవాలి. ఆమె శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి కాకుండా జాగ్రత్త పడాలి. అందుకు కొంత వ్యవధి ఇస్తూ ముద్దులతో ముంచెత్తుతూ పోవాలి. ఇటువంటి ముద్దుతో ఆమె వెంటనే ముగ్గులోకి దిగిపోతుంది.

రిథమ్, టెంపో ముఖ్యం..
ఊపిరాడేంత వరకు మాత్రమే మహిళ ముద్దును ఆస్వాదిస్తుంది. ముద్దుపై ఆమెకు మోజు తగ్గకూడదంటే ముద్దు ఇచ్చే పద్ధతిని మార్చుకోవాలి. టెంపోను, రిథమ్‌ను పాటిస్తూ ఆమె ఆనందంలో ఓలలాడే విధంగా చూడాలి.

సృజనాత్మకమైన స్పర్శ
ముద్దు పెట్టుకునేటప్పుడు పురుషులు మిగతా ఏదీ పట్టించుకోరని మహిళలు ఫిర్యాదు చేస్తుంటారు. దాన్ని యాంత్రికంగా కాకుండా కళాత్మకం చేసుకోవాలి. ముద్దు పెట్టుకునేటప్పుడు ఆమె శరీరంలోని వివిధ అంగాలను సున్నితంగా స్పర్శిస్తూ వెళ్లాలి.

మెడపై మోజు..
పెదవుల తర్వాత మహిళలు మెడపై ముద్దు పెట్టుకోవడాన్ని మహిళలు ఎక్కువగా ఇష్టపడుతారు. పురుషుడు తన గడ్డం వెంట్రుకలు గుచ్చుకోకుండా సున్నితంగా మెడపై ముద్దు పెడితే ఆమె మురిసిపోతుంది.