మనిషికి జీవితంలో శృంగారం తప్పనిసరి అవసరమా, సెక్స్ లేకుండా మనిషి జీవించలేడా అనేవి అర్థం లేని ప్రశ్నలు. అయితే, సెక్స్ అవసరమా, లేదా అనేది వ్యక్తిని బట్టి ఉంటుందని కామశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వివిధ విషయాలు దాన్ని నిర్ణయిస్తాయని చెబుతున్నారు.
రతిక్రీడ అవసరమనేది ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి మారిపోతుంది. సెక్సాలజీ మనిషిని పూర్తిగా, అన్ని దృక్కోణాల నుంచి పరిశీలించాలని చెబుతోంది. మనిషి, శరీరం, హార్మోనులు, పుట్టి పెరిగిన పరిస్థితులు, సామాజిక విలువలు, వ్యక్తిగత ఇష్టాఇష్టాలు, ఆశయాలు వీటన్నింటినీ విడమరిచి చూడాలని అంటోంది.
చాలా మంది ఆకలి తీర్చుకోవడం ఎంత అవసరమో, జీవితంలో సెక్స్‌కు సంబంధించిన ఆకలిని తీర్చుకోవడం కూడా అంతే అవసరమని చాలా మంది నమ్ముతుంటారు. జీవితంలో శృంగారానికి, రతిక్రీడకు ఉన్న ప్రాధాన్యం అత్యంత ముఖ్యమైనవి. వ్యక్తి జీవన విధానాన్ని అది నిర్ణయిస్తుంది కూడా. సెక్స్‌ను తనివి తీరా అనుభవించేవారు దైనందిన జీవితంలో ఉల్లాసంగా ఉంటారని సర్వేల్లో తేలింది.
ఇష్టానిష్టాలు ముఖ్యం
తమతో సెక్స్లో పాల్గొనే భాగస్వాముల ఇష్టాయిష్టాలను తెలుసుకోవడం కూడా అతి ముఖ్యం. సాధారణంగా పడక గదికి వచ్చే స్త్రీ బిడియంతో కొన్ని విషయాలు చెప్పలేదు. ఆమె హావభావాలను బట్టి, కదలికలను బట్టి పురుషుడు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
పురుషుడే గ్రహించాలి..
పురుషుడు స్త్రీ ఇష్టానిష్టాలను గ్రహించి, ఆమెను సొంతం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఎక్కడ చేయి వేస్తే తీసి వేస్తుంది, తన చేతిని తీసుకుని ఆమె ఎక్కడ ఉంచుకుంటుందనేది పురుషుడు తెలుసుకుని అందుకు అనుగుణంగా వ్యవహరించాలి. ఆమెకు ఏ విధమైన స్పర్శ, ఎటువంటి శృంగారం అవసరమో కూడా గ్రహించాలి.
అభ్యసించాల్సిందే..
సెక్స్లో తృప్తి పొందడం, వీర్యస్ఖలనంపై నియంత్రణ, భావప్రాప్తి పొందడం వంటివాటిని పురుషుడు ఆభ్యాసం చేయాలి. మహిళ భావప్రాప్తి పొందడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. పురుషుడు తన సుఖమే చూసుకునే గబగబా కానిచ్చేసి వీర్య స్ఖలనం కాగానే పక్కకు జరిగితే సరిపోదు. ఆమె తీవ్ర అసంతృప్తికి గురయ్యే ప్రమాదం ఉంది.
పరిశుభ్రత కూడా అవసరమే..
శృంగారంలో తృప్తినిచ్చే వాటిలో పరిశుభ్రత, ఆత్మవిశ్వాసం అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. వాత్సాయనుడు వ్యక్తిగత పరిశుభ్రత, చక్కని పరిసరాలు, సుఖంగా ఉండే పడక గదులకు ప్రాధాన్యతనిచ్చాడు. రతి క్రీడలో దుస్తులు తీసేసి ఒకరి శరీరాన్ని ఒకరు సాధ్యమైనంతసేపు ప్రేరేపించుకుని సంభోగానికి ఉద్యుక్తులు కావాలి
పురుషునికి కూడా అవసరమే..
ఫోర్ఫ్లేలు పురుషునికి అవసరమే. స్త్రీ కూడా ఫోర్ప్లేకు దిగితే శారీరకంగా ఒక్కటయ్యే ఇద్దరు కూడా మరింతగా సెక్స్ సుఖాన్ని అనుభవిస్తారు. ఇది దైనందిన జీవితంలో ఎంతో ప్రభావం చూపుతుందట. అందుకే స్త్రీపురుషుల జీవితంలో సెక్స్ ఓ భాగమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.