తమ భార్యలు సెక్స్‌కు సహకరించడం లేదని చాలా మంది పురుషులు ఫిర్యాదులు చేస్తుంటారు. భార్యతో సుఖం లేకుండా పోయిందని ఆవేదన చెందుతుంటారు., ఒక్క రాత్రిలో రెండు సార్లు తన కౌగిట్లోకి వచ్చిన సందర్భాలు లేవని అంటుంటారు. వారానికో పది రోజులకో ఓసారి అయితే వస్తుంది గానీ అది కూడా సంతృప్తికరంగా ఉండడం లేదని చెబుతుంటారు.
మహిళలు రతిక్రీడ పట్ల విముఖ ప్రదర్శించడానికి కనిపించే కారణాలతో పాటు కనిపించని కారణాలు కూడా ఉంటాయి. రోటీన్ సెక్స్ వల్ల వారు విసుగు చెంది ఉండవచ్చు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మహిళలు రతిక్రీడకు దూరమవుతుంటారనేది సర్వసాధారణంగా వినిపించే విషయం.
నిజానికి, రతిక్రీడ విషయంలో భారత సమాజంలో మొదటి నుంచి కట్టుబాట్లు పనిచేస్తుంటాయి. అవి పురుషుడిపై కన్నా మహిళపై ఎక్కువ పనిచేస్తుంటాయి. అందుకే మహిళలు శృంగారంలో బిడియాన్ని, అనవసరమైన సిగ్గును ప్రదర్శిస్తుంటారు. అయితే, మహిళలందరూ అలాగే ఉంటారని చెప్పడానికి వీలు లేదు. రతి అంటే కొందరు స్త్రీలు ఇష్టపడకపోవడానికి లెక్కలేనన్ని కారణాలున్నాయని చెపుతున్నారు.
కుటుంబ వాతావరణం
రతిక్రీడ పట్ల మహిళలు ఆసక్తి ప్రదర్శించకపోవడానికి ప్రధాన కారణం కుటుంబ వాతావరణం. పెంపకంలో ఏర్పడిన అభిప్రాయాలు, స్నేహితులు, బంధువులు, సంఘం ప్రభావం... ఇవే ఎక్కువగా ఉంటాయి.
మార్పు వచ్చింది..
ఇటీవలి కాలంలో చాలా వరకు మార్పు వచ్చింది. సెక్సు మానవ సహజమైనదనీ, దాన్ని పూర్తి స్థాయిలో అస్వాదించి, ఆనందించాలనీ పెద్దలు సలహా ఇస్తున్నారు.
తొలిదశలో తప్పుడు అభిప్రాయం
వివాహమయ్యేంత వరకు కామం గురించి తప్పు అనే అభిప్రాయం ఏర్పరచి, ఆ మరుసటి రోజు నుంచి అది పరమ ఒప్పు అని చెప్పినా పలువురు యువతులు జీర్ణించుకోవడం కష్టం. యేళ్ళ తరబడి పొందిన శిక్షణ మనస్సును ఉన్నట్టుండి మార్చుకోవడం సాధ్యం కాదని అంటుంటారు.
తప్పుడు సంకేతాలు..
స్త్రీలలో సెక్సు కేవలం సంతానం కోసమే అని ఆమె అభిప్రాయం భారత సమాజంలో నాటుకుపోయి ఉంది. దానివల్ల అమెకు సెక్సు పట్ల మొదటి నుంచీ పెద్దగా ఆసక్తి లేక పోవచ్చు.
మాట్లాడి సుముఖం చేయాలి..
సెక్స్ పట్ల మహిళలు సముఖులు కావడానికి పురుషులు చొరవ ప్రదర్శించాలి. అది అత్యంత సహజమైందని, దాన్ని ఏ మాత్రం జంకుగొంకూ లేకుండా అనుభవించాలని చెప్పాలి. ఆరోగ్యకరమైన, కట్టుబాట్లకు లోబడి కూడా సెక్స్లో ఆనందాన్ని జుర్రుకోవచ్చునని నచ్చజెప్పాలి.