•  

సెక్స్: పడకను ఊపేస్తున్నారా, లేదా (పిక్చర్స్)

పురుషుడితో మంచంపై తాము సరిగా వ్యవహరించడం లేదంటే మహిళలు బహుశా నమ్మకం పోవచ్చు. వారు దాన్ని గ్రహించలేరు కూడా. తమ పురుషుడు మెచ్చే, నచ్చే సుఖాన్ని పొంది, ఆనందాన్ని అందించే విధంగా తాము వ్యవహరిస్తున్నామా, లేదా అనేది మహిళలు పునరాలోచన చేసుకుంటే దాంపత్య సుఖం మరింత ఆనందంగా ఉంటుంది.



మహిళలు తాము సరిగా వ్యవహరించడం లేదనే విషయాన్ని కూడా గుర్తించలేరు. చిన్న పొరపాట్లే అయినా శృంగార జీవితంపై అవి పెద్ద ప్రభావమే చూపుతాయి. ఆ పొరపాట్లను గుర్తించడమే కష్టం. గుర్తించిన తర్వాత సరిదిద్దుకోవడం పెద్ద కష్టం కాదు.



పడకగదిలో పురుషుడు ఏం కోరుకుంటున్నాడనే విషయాన్ని మహిళలు గుర్తించి వ్యవహరించాల్సిన అవసరం ఉంది. లేదంటే, పురుషుల జీవితాలే కాకుండా మహిళల జీవితాలు కూడా చిరాకులకు, ఆందోళనలకు దారి తీస్తాయి. కాపురాలు కల్లోల సముద్రంలా మారిపోతాయి.



పడకగదిని చిందరవందరగా చేయకూడదు

 

పడకగదిని కార్యాలయంలాగా మార్చవద్దు. అంతేకాకుండా ఇంటి సామాను పెట్టే గదిగా మార్చకూడదు. దుస్తులను బెడ్రూంలోనే పడేయడం, ఉతికి ఆరేసిన దుస్తులను పడకలపై పడేయం వంటిని చేయకూడదు. పడకగదిని చిందరవందరగా ఉంచకూడదు.

 

ఓరల్ సెక్స్‌కు వెనకాడకూడదు..

 

మీ పురుషుడు ఓరల్ సెక్స్ అంటే బాగా ఇష్టడుతాడా, లేదా అనేది తెలుసుకోండి. అతను కావాలంటే అందుకు సిద్ధం కావడం వల్ల పోయేదేమీ లేదు, పైగా ఆనందం మీ సొంతమవుతుంది.

 

వెంటనే దూకేయొద్దు..

 

రతిక్రీడ ముగియగానే పడకపై నుంచి దూకేసి వెళ్లకుండి. మీ పురుషుడి కౌగిలిలో కాసేపు ఒదిగిపోండి. అతన్ని ప్రశంసించండి. వెంటనే బాత్రూంకు పరుగెత్తడం వల్ల పురుషుడికి అసంతృప్తి కలిగే అవకాశం ఉంటుంది.

 

సెక్సీగా కనిపించండి..

 

అందాలను దాచిపెట్టి, నిండుగా దుస్తులు కప్పేసుకోవడం సరి కాదు. కాస్తా సెక్సీగా కనిపించే దుస్తులు ధరిస్తే పడకగదిని మరింతగా వెలిగించవచ్చు. మీ శృంగార ప్రదర్శనను పురుషుడు ఇష్టపడుతాడు.

 

జాప్యం వద్దు..

 

మీ పురుషుడు పడకపై పడుకుని నిరీక్షిస్తుంటే, మీరు బాత్రూంలో స్నానం చేస్తూనో, దంతాలు తోముకుంటూనో, మరో రకంగా జాప్యం చేయవద్దు. మీతో రతిక్రీడ కోసం ఉవ్విళ్లూరుతున్న పురుషుడు మీ జాప్యం వల్ల నీరుగారిపోయే ప్రమాదం ఉంది.

 

రోటీన్ నుంచి బయటపడండి..

 

రతిక్రీడలో చాలా మంది దంపతులు చాలా బద్దకంగా వ్యవహరిస్తారు. ఏదో అయిపోయిందనే పద్ధతిలో రతిక్రీడ తీవ్రమైన ఆసంతృప్తికి గురి చేస్తుంది. మీ పురుషుడికి కొత్త రుచులు చూపించి, మీరూ ఆనందాన్ని ద్విగుణీకృతం చేసుకోవచ్చు.

 

లీడ్ తీసుకోవాలి..

 

సెక్స్‌లో చాలా మంది మహిళలు లీడ్ తీసుకోరు. ఇది పురుషుడికి విసుగ్గా ఉంటుంది. మహిళలు లీడ్ తీసుకుంటే పురుషులు ఉప్పొంగిపోతారు. తనతో సెక్స్‌కు మీరు తహతహలాడుతున్నారని పురుషుడు అనుకుంటే రతిక్రీడలో అతను మరింత ఉత్సాహంగా ఊపేస్తాడు.

 

ఫేవర్ చేస్తున్నట్లు కాదు..

 

సెక్స్ చేయడానికి మీరే అవకాశం ఇచ్చి ఏదో ఫేవర్ చేస్తున్నట్లుగా కొంత మంది మహిళలు పురుషుల పట్ల వ్యవహరిస్తారు. ఇది శృంగార జీవితానికి మంచిది కాదు. అతనికి సెక్స్ ఎంత అవసరమో, మీకు కూడా అంతే అవసరమని గుర్తించి వ్యవహరించాలి.

 

మీ అందాల గురించి అపోహలు వద్దు..

 

అద్దంలో చూసుకుంటూ మీ అందాలను పరీక్షించుకుని తాము ఆకర్షణియంగా లేమని మహిళలు భావిస్తుంటారు. తమలో అందం తరిగిపోతుందని కూడా అనుకుంటూ ఉంటారు. అలా అనుకుని పురుషుడికి దూరమవుతూ ఉంటారు. అది మంచిది కాదు. మీతో సాన్నిహిత్యం పెరిగిన తర్వాత పురుషుడికి మీరు అందంగానే కనిపిస్తారు. మీతో శృంగారం అతనికి తృప్తినిస్తుంది.

 

 

English summary
Have you ever wondered if you could be bad in bed? We all want to be the sex kitten our man desires. But the truth is that you may not be as good as you think you are. Signs of being bad in bed can sometimes be subtle, and yet very obvious. But, recognising the signs can be difficult. Read on to find out if these describe your sex life and work towards steamier nights from now onwards.
Story first published: Friday, July 5, 2013, 13:08 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras