దాంపత్య దర్మంలో నిర్వహించాల్సిన శృంగార జీవితానికి పడకగది వేదిక. దంపతులు పడకగదిని శృంగారానికి వేదికగా మార్చుకుంటారు. పడకగదిలోకి అడుగుపెడితే చాలు, అన్నీ పటాపంచలై దంపతులు పరస్పరం వాటేసుకునే విధంగా ఉండాలి. ఇళ్లలో అత్యంత సౌకర్యవంతమైన గదిగా దాన్ని మార్చుకోవాల్సిందే.
పడకగదిలోకి అడుగుపెడితే బాహ్యప్రపంచాన్ని మరిచిపోయి స్త్రీపురుషులు మన్మథ సామ్రాజ్యంలో తేలియాడే విధంగా ఉండాలి. అందుకు అనుగుణంగా పడకగదిని తీర్చిదిద్దుకోవాలి. మీ పడక గదిని బట్టి కూడా మీరెంతగా శృంగారజీవితాన్ని అనుభవిస్తున్నారో అర్థమవుతుంది.
పడకగదిని రూపొందించుకోవడంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. రాత్రిపూట మసక మసక వెలుతురులో మంత్రలోకం సరిహద్దులు తాకాలి. అన్ని భావనలు మటుమాయమై శృంగార భావనలను పడకగది ఉద్దీపింపచేయాలి.
పడకగదిలో మసక మసక వెలుతురు ఉండాలి. దానివల్ల రోమాంటిక్ భావనలు పుడుతాయి. కొవ్వొత్తులు అందుకు బాగా పనికివస్తాయి. కదిలే నీడలు గొప్ప భావనలను ఉద్దీపింపజేస్తాయి. వెలుతురు అధికంగా ఇచ్చే బల్బులను వాడకూడదు. కొవ్వొత్తులు కాదనుకుంటే డిమ్, సాఫ్ట్ లైట్స్ వాడాలి. వీధి లైట్లు లోనికి చొరబడకుండా దట్టమైన కర్టెన్లు వాడాలి.
బెడ్ ఆకర్షణీయంగా, ఆహ్లాదకరంగా ఉండాలి. సాఫ్ట్ లుక్ ఇచ్చే బెడ్ షీట్లను వాడాలి. రఫ్ వస్త్రాలను వాడకూడదు. సున్నితంగా, లాలిత్యంగా ఉండాలి. సాటిన్, సిల్క్ వంటివి బాగా పనికి వస్తాయి. సెక్సీ కలర్స్ శృంగారోద్దీపనను పెంపొందిస్తాయి. ఎరుపు, ఆరెంజ్ వంటి బ్రైట్ కలర్స్ వాడాలి.
వివిధ సైజుల్లోని ప్లష్ పిల్లోస్ వాడాలి. రెండు పెద్ద దిండ్లు, నాలుగు త్రికోణపు ఆకారంలో గల దిండ్లు, ఐదు చిన్నపాటి చతురస్రాకారాపు దిండ్లు వేసుకోవాలి. ఎటు వరిగితే అటు సౌకర్యంగా ఉండే విధంగా ఆ దిండ్లు ఉపయోగపడుతాయి. ప్రైవసీని అందించే విధంగా కర్టెన్లు ఉండాలి.
పడకగదిలోకి అడుగు పెట్టడానికి సుగంధ పరీమళాలు ముక్కుపుటాలను తాకి, శరీరానికంతటికీ హాయిని ఇచ్చే విధంగా ఉండాలి. మొత్తం దేహం తేలికపడుతుంది. ఇందుకు సువాసనలు వెదజల్లే కొవ్వొత్తులను వాడవచ్చు. స్ప్రేలు కూడా వాడవచ్చు.