ప్రతి ఒక్కరికీ ప్రతి విషయం తెలుసుననేది నిజం కాదు. ముఖ్యంగా, రతిక్రీడ విషయానికి వస్తే అది మరీ ముఖ్యం. రతిక్రీడలో ఎవరూ పరిపూర్ణత సాధించలేకపోవచ్చు. కానీ, కొందరు పడక మీద తనలా ఊపేసేవాడు ఉండబోడని నమ్ముతుంటారు. తన మహిళను అలా నమ్మించడానికి ప్రయత్నిస్తుంటాడు.
అయితే, చాలా మంది పురుషులు తమ మహిళను సంతృప్తి పరచాలని, ఆమె శృంగార సామ్రాజ్యంలో తేలియాడించాలని ఉవ్విళ్లూరుతుంటారు. కానీ, వారికి తాము మగాళ్లమే అహం అడ్డు వస్తూ ఉటుంది. శృంగారాన్ని కళాత్మకంగా అనుభవించడానికి తన భాగస్వామికి ఏం కావాలో తెలుసుకుని వ్యవహరించాల్సి ఉంటుంది.
వాస్తవాన్ని అంగీకరించి, పురుషులు గానీ మహిళలు తమ భాగస్వాములను సంతృప్తి పరుస్తూ తాము సుఖాన్ని అనుభవించడం ధ్యేయంగా ముందుకు సాగితే మంచి ఫలితం వస్తుంది. ఇద్దరికీ సంతృప్తిగా ఉంటుంది. ఆనందం సమపాళ్లలో దక్కుతుంది.
నాలా సెక్స్‌లో ఊపేసేవాడు ఉండడని అనుకోవడం సరి కాదు. ఆమెను సంతోషపెట్టగల మగాడు ఇతనేనని ఆమె గ్రహించాలంటే పురుషుడు అందుకు అనుగుణంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రతిక్రీడలో అభద్రతా భావాన్ని తొలగించుకోవాలి.
ఆమె పెదవులను పురుషుడు తన పెదవులతో మూసేస్తే మంత్రించినట్లు ఉంటుందని భావిస్తారు. అంత మంత్రించినట్లు ఉందా, లేదా అనేది అనుభవానికి రావాల్సిందే..
స్త్రీపురుషుల దేహాల మధ్య కెమిస్ట్రీ బాగా కుదరాలి. ఆమె అతని కౌగిట్లో బందీ అయితే అదో తీయని క్షణంగా ఉండాలి.
పురుషుడు తన మునివేళ్లతో మహిళ దేహాన్ని మీటితే వీణలా ప్రతిస్పందిస్తుంది. ఆమె శరీరంలోని ప్రతి భాగం మీ మునివేళ్ల స్పర్శకు స్పందిస్తుంది. అది ఆమెను కామోద్వేగం దిశగా తీసుకుని వెళ్తుంది.
కామోద్వేగంతో పురుషుడు మహిళ చెంతకు గుటకలు వేస్తూ రావాలి. ముద్దు పెట్టుకోవద్దు.. మురిపెంగా ఆమె చెంపలను మీ చెంపలతో మర్దన చేయండి. ముక్కును కూడా వాడవచ్చు.
రతిక్రీడలో స్త్రీపురుషులు ఇద్దరూ సమాన భాగస్వాములు కావాలి. అప్పుడే ఇద్దరు శృంగారంలో విజేతలుగా నిలుస్తారు. ఏ ఒక్కరిలో అనాసక్తి చోటు చేసుకున్నా అసంతృప్తికి గురి కావడం ఖాయం.