పిల్లులు కావాలని కోరుకునే దంపతులు ప్రతి రోజూ రతిక్రీడ సాగిస్తే మంచిదట. ప్రతి రోజూ సెక్స్ చేయడం వల్ల వీర్యకణాలు ఆరోగ్యంగా, జోరుగా తయారవుతాయని అంటున్నారు. ఇటీవలి పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. రతిక్రీడను నిత్యం చేయడం వల్ల వీర్యకణాలు ఎప్పటికప్పుడు వెళ్లిపోయి, ఆరోగ్యకరమైన వీర్యకణాలు పుట్టుకొస్తుంటాయని ఆస్ట్రేలియాకు చెందిన శాస్త్రవేత్త డాక్టర్ డేవిడ్ గ్రీనింగ్ అంటున్నారు.
నిత్యం సెక్స్ చేయడం వల్ల వీర్యకణాల సంఖ్య తగ్గిపోయి గర్భం దాల్చడం కష్టమవుతుందనే అభిప్రాయాన్ని ఈ శాస్త్రవేత్త కొట్టిపారేస్తున్నారు. కొన్ని రోజులు రతిక్రీడకు విరామం ఇస్తే వీర్యకణాల వృద్ధి జరుగుతుందని, గర్భానికి అవసరమైన వీర్యకణాలు ఉంటాయని అనేవారు.
ఎక్కువ రతిక్రీడలో పాల్గొనడం వల్ల వృషణాల్లో వీర్యకణాల నిలువ తగ్గిపోతుందని, దానివల్ల పురుషుడిలోని కణాల కారణంగా చెడిపోయే ప్రమాదం తగ్గుతుందని తాజా పరిశోధనలో తేల్చారు. ప్రతి రోజూ రతిక్రీడలో పాల్గొంటే చెడిపోయిన వీర్యకణాలు వెళ్లిపోయి, తాజా ఆరోగ్యకరమైన వీర్యకణాల వృద్ధి జరుగుతుందని అంటున్నారు.
పురుషుడు ప్రతి రోజూ రతిక్రీడలో పాల్గొనడం వల్ల వృషణాల్లో ఇతర కణాల ప్రభావానికి లోనైన వీర్యకణాలు వెళ్లిపోతాయని, తాజా ఆరోగ్యకరమైన వీర్యకణాలు వృద్ధి చెందుతాయని గ్రీనింగ్ అంటున్నారు.
నిత్యం రతిక్రీడలో పాల్గొనడం వల్ల స్కలనం ఎక్కుసార్లు జరిగి వీర్యం తగ్గిపోతుంది. చాలా మందిలో ఇది సమస్యే కాదని గ్రీనింగ్ అంటున్నారు. అయితే, సాదారణ రీతిలో జరిగే స్కలనం ద్వారా విడుదలయ్యే వీర్యకణాలు మహిళ గర్భం దాల్చడానికి సరిపోతాయని అంటున్నారు.
నిత్యం రతిక్రీడలో పాల్గొనడం వల్ల ఎక్కువ సార్లు స్కలనం జరిగి వీర్యకణాలు తగ్గిపోయి మహిళ గర్భం దాల్చడానికి అవకాశాలు తక్కువ ఉంటాయనేది మానసికమైందే తప్ప అందులో నిజం లేదని గ్రీనింగ్ అంటున్నారు. నిత్యం రతిక్రీడలో పాల్గొనడం వల్ల వీర్యం స్థాయి సాధారణ స్థాయిలోనే ఉంటుందని చెబుతున్నారు.
వారానికి ఏడు రోజులు రతిలో పాల్గొనే పురుషుడికి మరో చికిత్స గానీ జీవనశైలిలో మార్పు అవసరం గానీ ఉండదు. వీర్యం స్థాయి తగ్గినా వీర్యకణాల నాణ్యత బాగుంటుందని చెబుతున్నారు.
పాత అభిప్రాయాన్ని తోసిరాజంటూ కొత్త ఆలోచనను ముందుకు తెచ్చిన గ్రీనింగ్ నిత్యం రతిక్రీడలో పాల్గొనే పురుషుడి వీర్యకణాలు మహిళలు గర్భం దాల్చే రేటును పెంచుతాయా అనే విషయంపై ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది.