వివాహ జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలంటే శృంగార జీవితం ఉల్లాసకరంగా ఉండాలి. దానివల్ల దాంపత్య జీవితం పటిష్టమవుతుంది. కొద్దిపాటి శ్రమ, ప్రణాళిక మీ దాంపత్య జీవితాన్ని సుఖమయం చేస్తుందనే విషయం గుర్తుంచుకుంటే చాలు. కొత్తగా దాంపత్య జీవితంలో అడుగు పెట్టిననాటి మధురానుభాతులను ఆ తర్వాత కూడా పొందవచ్చు.
ఐ లవ్ యూ వంటి మాట చెప్పడం, బ్రేక్ ఫాస్ట్ చేస్తున్నప్పుడు మీ భాగస్వామిని ప్రేమతో సున్నితంగా స్పర్శించడం వంటివి దాంపత్య జీవితంలో చాలా పనికి వస్తాయి. నేను ఖాళీ దొరికితే నీ గురించే ఆలోచిస్తాను అని చెప్పడం వంటివి కూడా ఎంతో పనికి వస్తాయి.
మీ భాగస్వామికి నచ్చిన వంటలు చేయడం, దగ్గరుండి వడ్డించడం వంటివి రతిక్రీడకు ఫోర్‌ప్లేలాగా పనిచేస్తాయి. దానివల్ల రోజంతా మానసిక ప్రశాంత చేకూరి రాత్రి వెలిగిపోతుంది. పగటి పూట లభించే ప్రశాంత, ఉల్లాసకరమైన ఆలోచనలు రాత్రి రతిక్రీడను ఉర్రూతలూగించి ఆనందాన్ని ఇస్తుంది.
డేట్ నైట్స్ తప్పనిసరి. వారం మధ్యలో చక్కగా డ్రెస్ చేసుకుని ఇరువురు చక్కగా అమిరిపోండి. అప్పుల గురించి, రోగగ్రస్తులైన తల్లిదండ్రులు గురించి, పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడకండి. పెళ్లి చేసుకున్న మీ భాగస్వామితో మళ్లీ తొలి రోజుల్లో లాగా వ్యవహరించండి.
రోజువారీ పనులకు దూరంగా ఉండండి. ఆఫీసులకు సెలవు పెట్టవచ్చు. ఇరువురు ఓ టూర్ వేసుకోండి. డబ్బులు ఖర్చు కాకూడదనుకుంటే సాయంత్రం వేళ ఇరువురు కలిసి నడక సాగించండి. హోటల్లో భోజనం చేయండి.. లేదంటే ఆ పార్కుకో, మ్యూజియానికి వెళ్లండి. కలిసి చేసే పనిని ఎంచుకోండి.
పడకపై కొత్త పద్ధతులను ఆచరించండి. కొత్త రతిభంగిమలు ఆచరించండి. కొత్త పద్ధతుల్లో రతిక్రీడలో ప్రయోగాలు చేయండి.
నిందించుకోవడాలు ఉండకూడదు. ఇరువురి మధ్య కమ్యూనికేషన్ బాగుండాలి. మీకు ఏం కావాలో మీ భాగస్వామితో ఓపెన్గా చెప్పండి.
ఫోర్ప్లే ఉదయమే ప్రారంభం కావాలి. ఐ లవ్ యూ అని చెప్పండి. రాత్రి గుర్తుకు వస్తుందని చెప్పండి. నిన్ను చూస్తే ముద్దు వస్తుందని చెప్పండి..