స్త్రీపురుషుల శృంగార క్రీడలో ముద్దులకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ముద్దంటే చేదు కాదు, ముద్దు తీపి అని అందరికీ తెలుసు. ముద్దులతో మీ భాగస్వామిని ముంచెత్తితే కామోద్రేకం ఉర్రూతలూగడమే కాకుండా మీ ఇరువురి మధ్య సాన్నిహిత్యం కూడా పెరుగుతుంది. ముద్దులు ప్రధానంగా దంపతుల మధ్య అనురాగాన్ని, ఆప్యాయతను పెంచుతాయి.
ముద్దులు శృంగార క్రీడలో క్యాలరీలను ఎక్కువగా తగ్గించలేకపోవచ్చు గానీ సాధారణ స్థాయి కన్నా రెండింతలు మెటాబలిజమ్ పెరుగుతుంది. జిమ్‌కు డుమ్మా కొట్టాలని అనుకుంటే మీరు మీ భాగస్వామితో ముద్దుల సెషన్ పెట్టుకోండి. ముద్దులతో మురిపించడానికి వెనకాడాల్సిన అవసరం ఏమీ లేదు.
ముద్దులు మీలో ఉత్సాహాన్ని నింపడమే కాకుండా వయస్సు తగ్గినట్లు కూడా అనిపిస్తుంది. రతిక్రీడకు ముందు ముద్దులు అత్యంత ముఖ్యమైన వ్యవహారమనే విషయం దంపతులకు తెలుసు. ఎక్కడెక్కడ ఎలా ముద్దులు పెట్టాలనే విషయాన్ని వాత్సాయనుడు చాలానే చెప్పాడు. ముద్దులతో ఆరోగ్యం పెరుగుతుందని కూడా నిపుణులు చెబుతున్నారు. ముద్దుల వల్ల ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడుతుంది. దంపతుల మధ్య ప్రేమానురాగాలు వికసిస్తాయి. శరీర కండరాలు పట్టు సడలి హాయిగా కూడా ఉంటుంది.

ముద్దులు దంపతుల మధ్య ప్రేమానురాగాలను పెంచుతాయి. ఇరువురి మధ్య సాన్నిహిత్యాన్ని పెంచి బంధం గట్టి పడడానికి ఉపయోగపడుతాయి. సంభోగంలోకి దిగకుండా ముద్దులతో మురిపెంగా శృంగారాన్ని, సరససల్లాపాలను సరిపెట్టవచ్చు కూడా.

రతిక్రీడ హృదయానికి చాలా మంచిది. రతిక్రీడ వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది కూడా. దానికి ముందు ముద్దులతో ముగ్గులోకి దించడమనేది అత్యంత ప్రధానమైన క్రీడ. సంభోగంలో ముద్దులు ఆనందాన్నిద్విగుణీకృతం చేస్తాయి.

ముద్దులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. సంభోగం తర్వాత ముద్దులు కురిపిస్తే గొంతులో గరగర తగ్గుతుందట. తరుచుగా ముద్దుల్లో మునిగితేలేవారు జబ్బులకు దూరంగా ఉంటారని కూడా చెబుతున్నారు.

ముద్దులు పెట్టుకున్నప్పుడు విడుదలయ్యే ఎండాఫిన్స్, ఎండార్ఫిన్స్ మనిషికి ఆనందాన్ని ఇస్తాయి. ఒత్తిడికి లోనైనప్పుడు ముద్దులు పెట్టినా, ముద్దులు తీసుకున్నా ఊరట లభిస్తుంది. మందులు వాడడం కన్నా, మానసిక వైద్యుడ్ని సంప్రదించడం కన్నా ముద్దులు ఎక్కువగా పనిచేస్తాయట.

ముద్దులతో వేడెక్కినప్పుడు శ్రీరం అడ్రనాలిన్ను విడుదల చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. నొప్పుల నుంచి అది ఊరటను ఇస్తుంది. తలనొప్పితో బాధపడుతున్నప్పుడు మీ భాగస్వామి పెదవులను మీ పెదవులతో మూసేసి వేడెక్కిపోయి పరీక్షించుకోండి. దాని తడాఖా ఏమిటో తెలుస్తుంది.

తీవ్రమైన పని ఒత్తిడి వల్ల కోర్టిసాల్ పెరిగి అలసిపోతారు. మీ భాగస్వామిని ముద్దులతో ముంచెత్తితే దాని స్థాయి తగ్గి నిరోధక శక్తి పెరుగుతుంది. ఎండోక్రైన్ సిస్టమ్ కూడా మెరుగుపడుతుంది. మెదడులో కల్లోలం తగ్గుతుంది.