లైంగిక జీవితం రుచి కోల్పోతోందంటే ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిందే. వయస్సు కారణంగా లైంగిక జీవితంలో చురుకుదనం తగ్గుతుంది. శృంగార క్రీడ పట్ల ఆసక్తి కూడా తగ్గుతుంది. తీరిక లేని జీవనశైలి, నిరాసక్తత కారణంగా కూడా రతిక్రీడ మసకబారుతుంది.
కామకేళీ విలాసం లేకుండా మహిళలు రోజులు, వారాలు ఉండగలరు. సెక్స్ లేకుండా జీవించడం పురుషులకు దుర్భరంగానే ఉంటుంది. అతనికి శృంగారంపై ఆసక్తి ఉండి, మీరు మూడ్‌లోకి రాలేకపోతే ఆలోచించాల్సిందే. మీరు కామోద్వేగాన్ని పొందడానికి ప్రయత్నించాలి. అతనితో శృంగార జీవితాన్ని పంచుకున్నప్పుడే దాంపత్య సుఖం కూడా బాగుంటుంది.
సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోకుండా మీ భాగస్వామికి ఆనందాన్ని పంచుతూ, మీరు ఆనందంగా గడపాలంటే కొన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. లైంగిక క్రీడకు దూరంగా ఉండడం వల్ల వచ్చేదేమీ లేకపోగా, పోయేది చాలా ఉంటుంది. మీ భాగస్వామి సాన్నిహిత్యాన్ని మీరు కోల్పోవచ్చు. దైనందిన జీవితంలో అనవసరమై చిరాకులు తలెత్తవచ్చు. అందువల్ల లైంగిక జీవితాన్ని మధురం చేసుకుంటూ దాంపత్య జీవితాన్ని మధురం చేసుకోండి.

సెక్సీగా కనిపించండి..
సెక్సీగా లేకపోతే కూడా సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతుంది. సెక్సీగా కనిపించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోండి. సెక్సీగా కనిపించే దుస్తులు కొనుక్కోండి. మీ శరీర భాగాలు కనిపించీ కనిపించకుండా ఉండే దుస్తులు ధరించండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి.

హాస్య రసాన్ని పండించండి
మీ జీవిత భాగస్వామితో హాస్యాలాడుతూ ఉండండి. హాస్యం విసుగు నుంచి బయటపడేస్తుంది. దానివల్ల ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరిగి, సెక్స్ కూడా ఆనందంగా ఉంటుంది.

ఫోర్ ప్లేకు అవకాశం ఇవ్వండి..
ఫోర్ ప్లే మీ కామవాంఛను పెంచి ఉద్రేకాన్ని పెంచుతుంది. అది మెల్లగా సంభోగానికి దారి తీస్తుంది. ఇది స్తీపురుషులిద్దరికీ ఆనందాన్ని ఇస్తుంది. ముద్దులతో ఫోర్ ప్లేను ప్రారంభించి, క్రమంగా ముందుకు సాగవచ్చు.

డర్టీ వీడియోను కలిసి చూడండి..
రోమాంటిక్ లేదా డర్టీ వీడియోను కలిసి చూడండి. దీనివల్ల ఇరువురిలోనూ కామోద్రేకం రగులుతుంది. దానివల్ల ఇరువురు కూడా అనాలోచితంగానే కార్యంలోకి దిగిపోతారు.

పరీమళాలతో ముందుకు..
మంచి సుగంధద్రవ్యం మీలో కామోద్వేగాన్ని రగిలిస్తుంది. సువాసన స్త్రీపురుషులను చాలా సందర్భాల్లో ఒక్కటి చేస్తుంది. మల్లెపూలను అందుకే చాలా మంది ఇష్టపడతారు.

మార్పు తెండి..
సెక్స్ పట్ల విసుగు చెందితే, కొత్త రతి భంగిమలను ప్రయత్నించండి. పడకగదికి వెలుపల ఇద్దరు ఒక్కటయ్యే ఏర్పాటు చేసుకోండి. దీనివల్ల కామోద్రేకం పెరిగి, లైంగిక క్రీడను ఆనందించడానికి వీలవుతుంది.