రతిక్రీడలో స్త్రీపురుషులు చేసే తప్పులు కొన్ని ఉంటాయి. ఉద్దేశ్యవూర్వకంగా వారు ఆ తప్పు చేస్తారని అనుకోలేం. తన భాగస్వామి కూడా తనతో పాటే సంతృప్తి చెందుతుందనే అపోహ వల్ల అలాంటి తప్పులు దొర్లుతుంటాయి. లేదంటే, రతిక్రీడలో భాగస్వామి ఆనందానికి కాకుండా తన ఆనందానికి మాత్రమే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కూడా అలా జరుగుతుంది.
ఇంకా చెప్పాలంటే, రతిక్రీడ సమయంలో భాగస్వామి ఇష్టాలకు ప్రాధాన్యం ఇవ్వకుండా మొండిగా వ్యవహరించడం వల్ల కూడా పొరపాటు జరుగుతుంది. తన ఇష్టానిష్టాలను మాత్రమే పట్టించుకుని భాగస్వామి ఇష్టానిష్టాలను పక్కన పెడితే భాగస్వామి నీరసపడే అవకాశం ఉంది. క్రమంగా భాగస్వామికి రతిక్రీడపై విసుగు కలిగే అవకాశం ఉంది.
శృంగారంలో మీతో పాటు మీ భాగస్వామిని తీసుకుని వెళ్లడం వల్ల కలిగే అనుభవం, అనుభూతి, సంతృప్తి అత్యంత గణనీయమైందనే విషయాన్ని గుర్తించాలి. పురుషులకు తమ మహిళ ఎంతగా సంతృప్తి చెందిందంటే అంత ఆనందిస్తాడు. దాన్ని పురుషత్వానికి సంకేతంగా భావిస్తాడు. అందువల్ల రతిక్రీడలో పొరపాట్లు దొర్లకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం. వాటిని చూడండి..
పురుషుడు స్కలనంతో సంతృప్తి చెందుతాడు. కానీ, మహిళకు దాంతోనే సరిపోదు. పతాక స్థాయికి చేరుకుని భావప్రాప్తి పొందడానికి మహిళకు ఎక్కువ సమయం పడుతుంది. అందువల్ల పురుషుడు స్కలనం కోసం తొందరపడకుందా సాధ్యమైనంత ఎక్కువ సేపు రతిక్రీడను కొనసాగించడానికి ప్రయత్నించాలి. అంగప్రవేశం చేసి, హడావిడిగా ముగించకూడదు.
పురుషుడికి రతిక్రీడ ఓ యాక్షన్, లైంగిక క్రీడ. అతను గబగబా లైంగిక క్రీడను ముగించి తనను తాను తృప్తి పరుచుకుంటాడు. కానీ, మహిళకు అలా కాదు. మహిళ తన భాగస్వామితో శారీరకంగా, మానసికంగా అనుబంధాన్ని పటిష్టపరుచుకోవడానికి లైంగిక క్రీడను ఓ సాధనంగా భావిస్తుంది. అందువల్ల లైంగిక క్రీడను కేవలం కోరికను తీర్చునే క్రియగా మాత్రమే పురుషులు భావించకూడదు.
రతిక్రీడ సమయంలో భాగస్వామితో టీచర్ మాదిరిగా వ్యవహరించకూడదు. అలా వ్యవహరిస్తే భాగస్వామి మనసు దెబ్బ తినే అవకాశం ఉంది. మీ భాగస్వామి కోరుకున్న రీతిలో సూచనలు ఇస్తూ వెళ్లండి. కొన్ని సమయాల్లో భాగస్వామికి సాయపడాల్సి ఉంటుంది. తనకు ఆనందం కలిగే విధంగా తన పురుషుడిని మహిళ జీ స్పాట్‌కు నడిపించవచ్చు.
రతిక్రీడలో విసుగును, అసంతృప్తిని పారద్రోలడానికి కొత్త భంగిమలు ఆచరించాలి. కొత్త భంగిమలను చేపట్టే విషయంలో భాగస్వామి కోరికను వ్యతిరేకించకూడదు. భాగస్వామి ఇష్టం వ్యవహరించడం వల్ల ఇరువురి మధ్య సాన్నిహిత్యం పెరుగుతుంది. మహిళలు సిగ్గును, బిడియాన్ని పక్కన పెట్టాలి.