పురుషత్వం తగ్గిపోతుందని, లైంగిక క్రీడలో పటుత్వం తగ్గుతోందని, కామవాంఛ తగ్గుతోందని ఏదో ఒక సమయంలో పురుషులు అనుకోవడం పరిపాటి. ఏదో ఒక దశలో పురుషుడికి తనపై తనకు అపనమ్మకం కలుగుతుంది. తన మహిళను తాను లైంగిక క్రీడలో సరిగా సంతృప్తిపరచగలుగుతున్నానా, లేదా అనే అనుమానం కూడా వేస్తుంది.
కొన్ని సమయాలలో మహిళా భాగస్వామి ముందు అంగస్తంభన జరుగదు. దానికి కారణాలు తెలియక పురుషుడు ఆందోళన చెందుతాడు. ఆ ఆందోళన కారణంగా మరింత నీరసించిపోతాడు. ఆశించిన రీతిలో ఆమెకు ఆనందం లభించకపోతే తలవంపులవుతుందని భయడుతాడు. అయితే, కొన్ని సార్లు మందులు లేకుండానే పరిస్ధితి మెరుగవుతుంది.
రతిక్రీడ ఆనందంగా సాగాలంటే పురుషుడికి ఆత్మవిశ్వాసం ఉండాలి. తన పటుత్వంపై నమ్మకం ఉండాలి. ఇతరేతర ఆలోచలను, ఆందోళనలను పక్కన పెట్టాలి. మన్మథసామ్రాజ్యాన్ని పాలించడమే ఏకైక లక్ష్యంగా పడక గదిలోకి అడుగు పెట్టాలి. కొత్త పద్ధతులు, కొత్త భంగిమలతో రతిక్రీడను అదరగొట్టడానికి సిద్ధపడాలి.
కామాన్ని పెంచే చేసే చేపలు, జింక్ వున్న పదార్ధాలు తినండి. సరైన ఆహార పదార్థాలు తినండి. ఆరోగ్యం సరిగా లేకుంటే రతిక్రీడ సాఫీగా సాగదు. ప్రతిరోజూ అయిదు నుండి పది పండ్లు, కొన్ని కూరగాయలు మీ ఆరోగ్యానికి మంచిదని గుర్తించండి. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు రక్తప్రసరణ బాగా పెంచి అంగాలను పటిష్టం చేస్తాయి.
పొగతాగే వారైతే వెంటనే పొగ తాగటం మానేయండి. మీ జననేంద్రియాలు రక్తనాళాలు బాగ పని చేస్తాయి.
శారీరక పటుత్వం అవసరం. జననేంద్రియాలకు రక్తప్రసరణ బాగా వుండాలంటే తగిన వ్యాయామాలు చేయాలి. మానసికంగా కూడా ఆనందంగా వుంటుంది. బరువు తగ్గడానికి ప్రయత్నించాలి. బరువు వల్ల రతిక్రీడలో అసౌకర్యం ఉంటుంది.
శృంగార సౌఖ్యం పూర్తి స్థాయిలో పొందాలంటే అపుడపుడూ మసాజ్ అవసమవుతుంది. మసాజ్ ఒత్తిడులను, కోపాన్ని, ఆందోళనను దూరం చేస్తుంది. డిమ్ లైట్‌లో, మెత్తటి మ్యూజిక్ వింటూ మసాజ్ చేయించుకుంటే మనసు మగువవైపు మళ్లుతుంది.
అన్నింటికీ మించి రతిక్రీడలో అదరగొట్టే సత్తా ఉందనే ఆత్మవిశ్వాసం ఎక్కువగా పనిచేస్తుంది. కొత్త పద్ధతులకు, భంగిమలకు మీ మహిళను సంసిద్ధం చేసి, మీరు సిద్ధం కావాలి.