నన్ను దోచుకుందువటే అంటూ ఓ సినీ కవి ఆలపించాడు. ఆమె మిమ్మల్ని దోచుకోవడం ఎంత ముఖ్యమో ఆమెను మీరు దోచుకోవడం అంతే ముఖ్యమని పురుషులు గ్రహించాలి. మహిళ మనసును దోచుకుంటే శృంగార జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. ఆమె మనసును మీరు ఆకట్టుకుంటే ఆమె మీకు పూర్తిగా వశమైపోయి స్వర్గాన్ని రుచి చూపిస్తుంది.
రతిక్రీడ అనేది కేవలం శరీరాలకు సంబంధించింది మాత్రమే కాదు, మనసుకు కూడా సంబంధించింది. మనసులు కలిస్తే అనురాగం, ఆప్యాయత పెరిగి, శరీరాలు ఒకటి కావడం ద్వారా అది గాఢతను సంతరించుకుంటుంది. ఆ గాఢత వల్ల ఒకరినొకరు ఎల్లవేళలా కోరుకుంటారు. అలా కోరుకోవడం వల్ల దాంపత్య జీవితం సుఖమయం అవుతుంది.
మీ మహిళ మనసు దోచుకోవడానికి కొన్ని మెళుకువలు ప్రదర్శించండి. కొద్దిగా కష్టమే అయినా ఆమె మనసునూ దేహాన్ని సొంతం చేసుకోవడానికి అది అవసరమే. అలా సొంతం చేసుకున్న తర్వాత అందులోని గాఢానుభూతి, ఆనందం మీకు తెలిసి వస్తుంది. ఆమె మీకు ఎంత అవసరమో చెప్పండి. ఆమె హృదయం కరిగిపోతుంది. పురుషులు చాలా మంది తనకు నీ అవసరం చాలా ముఖ్యమని తమ మహిళలకు చెప్పడానికి వెనకాడుతారు. చిన్నతనంగా భావిస్తారు. కానీ, అలా చెప్పడం ద్వారా ఆమెకు అందించే ఆనందాన్ని జుర్రుకోవడం ఎంత మధురంగా ఉంటుందో ఓసారి ఆలోచించిండి.
ప్రశంసలకు ఎవరైనా పడిపోతారు. కాబట్టి మీ మహిళను ఏదైనా విషయం మీద ప్రశంసించండి. అది ఆమెలో గర్వాన్ని పెంచి, మీ పట్ల అనురాగం పెంచేదిగా ఉండాలి. ఆమెను అభినందించడానికి సమయం, సందర్భం అవసరం లేదు.
మీ మహిళకు ఇంటిపనిలో సహకరించండి. ఆమెకు కావాల్సినవి అడకుండానే అందించండి. మీరు బిజీగా ఉన్నా కొన్నిసార్లు అలా సాయం చేస్తే ఆమె మనసు మీ పట్ల మొగ్గు చూపడమే కాకుండా ఆమె మీ ఒళ్లోకి వచ్చినప్పుడు రతిక్రీడ మధురంగా ఉంటుంది.
మహిళలకు జ్ఞాపకం ఎక్కువ. మీ ప్రశంసలను ఎంత బిజీగా ఉన్నా మహిళ మరిచిపోదు. వాటిని గుర్తు చేసి మిమ్మల్ని ఆనందింపజేస్తుంది.
మీ మహిళకు అప్పుడప్పుడు సర్‌ప్రైజ్ ఇవ్వండి. ఏదైనా బహుమతి రూపంలో ఆమెకు అందించండి. లేదంటే షాపింగ్ వంటివాటికి తీసుకుని వెళ్లి ఆశ్చర్యం కలిగించండి. చిన్న చిన్న విషయాలకే మహిళలు మురిసిపోతారు. మీరు తన వెంట ఉన్నారనే అనుభూతి ఆమెకు ఎంతో ఆనందం కలిగిస్తుంది.
మీ మహిళ వద్ద మరో మహిళను ప్రశంసించకండి. మరిచిపోయి కూడా అలా ప్రశంసించవద్దు. అలా ప్రశంసిస్తే వెంటనే ఆమెకు కోపం వస్తుంది.