•  

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

కామసూత్రను శృంగారానికి సంబంధించి శాస్త్రీయ గ్రంథంగా పరిగణిస్తారు. సుగంధపరీమళాల గురించి, నూనెల గురించి ఈ గ్రంథంలో వాత్సాయనుడు ప్రముఖంగా చెప్పాడు. కామోద్వేగానికి, శృంగార భావనలకు ఆయిల్స్‌ను వాడడం అనేది ప్రాచీన కాలం నుంచి ఉంది. సువాసలను వెదజల్లే ఆయిల్స్ వల్ల పిత్తాశయాన్ని ఉద్వేగ పరిచి హార్మోన్లు విడుదల కావడానికి ఉపయోగపడుతుంది. అవి పరోక్షంగా మనలో శృంగార భావనలను ఉద్దీపింపజేస్తాయి.



వేదల్లో కూడా సంతానప్రాప్తికి వాడాల్సిన మొక్కల గురించి చెప్పినట్లు పండితులు చెబుతారు. ఆయిల్స్‌తో దంపతులు పరస్పరం శరీరాన్ని మర్ధన చేసుకోవడం ద్వారా కామోద్రేకం పెరుగుతుంది. ఆయిల్స్ వెదజల్లే పరీమళం దంపతులను రతిక్రీడ వైపు మళ్లిస్తాయి.



ఆహ్లాదకరమైన పరీమళాలు మనిషికి ఊరటను ఇచ్చి, ఆనందం వైపు పరుగులు తీయిస్తుంది. గులాబీ పుప్వులను చూస్తే శృంగార భావనలు ఇట్లే కలుగుతాయి. మల్లెపూవులను శృంగారానికి అవసరమైన పుష్పాలుగా పరిగణిస్తాం. మల్లెపూవులు జడలు తురుముకుని కాంత తన పురుషుడి కోసం నిరీక్షించడం అనేది మనం పలు సినిమాల్లో చూస్తుంటాం. మల్లెపూవులు వెదజల్లే సువాసన దంపతులను లైంగిక క్రీడ వైపు మనసును లాగుతాయి. అందుకే సుగంధ ద్రవ్యాలకు, సువాసనలు వెదజల్లె చముర్లకు రతిక్రీడలో అధిక ప్రాధాన్యం ఉంది.



పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

మూలికల నుంచి తీసిన చమురును వాడడం అనేది ప్రాచీన కాలం నుంచి ఆచరణలో ఉంది. మూలికల నుంచి తీసిన నూనెలు వాడడం వల్ల హార్మోన్లు విడుదలై దంపతులను కామకేళికి పురికొల్పుతాయి.

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

ఈజిప్టు ప్రేమదేవతగా పరిగణించే అఫ్రొడైట్ డెన్‌ను గులాబీ రేకులతో అలంకరిస్తారు. ఈజిప్టు అందాలరాణి క్లియోపాత్ర గులాబీ రేకులు వేసిన నీళ్లలో స్నానం చేసేది. హృదయ చక్రం ద్వారా పనిచేయడానికి గులాబీ పనిచేసి ఆధ్యాత్మిక, శారీర ప్రేమను అందించడానికి ఉపయోగపడుతుందని భావిస్తారు.

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

జాస్మిన్ ఆయిల్ మానవ ఇంద్రియాలను తట్టిలేపుతుంది. ఈ పూవును మహిళను బుట్టలో పడేయడానికి వాడుతారు. జాస్మిన్ ఆయిల్ ఆత్మవిశ్వాసాన్ని పెంచి, రతిక్రీడకు సంబంధించిన భావనను పెంచి పోషిస్తుంది.

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

ఔరా కాసియా ఆయిల్ జాస్మన్ ఆయిల్ మాదిరిగానే ఉంటుంది. సుగంధాలను ఈ ఆయిల్ వెదజల్లుతుంది. ఇది మనిషికి శక్తిని ప్రసాదించడమే కాకుండా దంపతుల మధ్య ఆకర్షణను పెంచుతుంది. ఈ ఆయిల్‌‌ను పడక మీద కాటన్ బడ్‌లో ఉంచితే కామకేళీ విలాసం చెప్పనక్కర్లేదు.

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

గంధం తైలం గురించి చెప్పనే అక్కర్లేదు. మహిళల మెడకు గంధపు పూత పూయడం మనకు తెలిసిందే. కొన్ని ఇతర తైలాలతో కలిపి దీన్ని వాడవచ్చు. గంధం తైలం దంపతుల మధ్య శారీరక సాన్నిహిత్యాన్ని పెంచుతుందని భావిస్తారు.

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

జీలకర్ర తైలం స్త్రీపురుషులిద్దరికి మంచిది. మహిళల్లో సంతానవృద్ధికి పనికి వస్తుందని చెబుతారు. ఈ ఆయిల్ పురుషుల్లో శృంగార భావనలను పెంచుతుంది. దేహం శృంగార క్రీడకోసం అర్రులు చాస్తుంది.

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

క్లేరీ సేజ్ ఆయిల్ శృంగార క్రీడలో బాగా పనికి వస్తుంది. ఇది రిలాక్స్‌ను పెంచి, శృంగార భావనలు కలిగించడానికి పనికి వస్తుందని చెబుతారు. అయితే, గర్భం దాల్చాలంటే మాత్రం ఈ ఆయిల్ వాడకూడదు.

పిక్చర్స్: కామకేళిలో కదను తొక్కాలంటే..

లవంగాల చమురు ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఉత్ర్పేరకంగా పని చేస్తుంది. ఇది అంతకు ముందు చవి చూడని అనుభూతిని శృంగారంలో చూపిస్తుంది.

 

English summary
Kamasutra often referred to as the Bible of sexuality, has mentioned profound use of ittar and aromatic oils in its literature. Since ancient times, these oils have been used widely to awaken desires and sensuous feelings.
Story first published: Friday, April 26, 2013, 12:31 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras