శృంగార జీవితాన్ని పండించుకోవడానికి చాలా తాంత్రిక భంగిమలున్నాయి. వాటిని ప్రయత్నించి రసాస్వాదన చేయడానికి మీరు ప్రయత్నించవచ్చు. వాటిని మీరు ఇష్టపడుతారు కూడా. తాంత్రిక రతి భంగిమలంటే ఏమిటి? కామసూత్ర చెప్పిన ప్రాచీన రతి భంగిమలు ఇవి. ప్రాచీన సాహిత్యం ప్రకారం - మావన శరీరంలోని శక్తి స్థాయిలను నియంత్రించడానికి 9 చక్రాలున్నాయి. ఈ చక్రాలను కలపడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఉద్వేగాల నుంచి, నొప్పుల నుంచి ఊరట పొందవచ్చు. స్వయం నియంత్రణ సాధించవచ్చు.
తాంత్రిక రతి ఈ 9 చక్రాలను క్రియాశీలం చేస్తుంది. స్త్రీపురుషుల లైంగిక క్రీడ సమయంలో అది జరుగుతుంది. ఆధ్యాత్మిక గురువులు, శృంగార శాస్త్ర నిపుణులు దీన్ని గుర్తిస్తారు. తాంత్రిక రతి అనేది ఓ కళ. దాన్ని అభ్యాసం చేయాల్సి ఉంటుంది. రతి క్రీడలో మునిగిపోయిన సమయంలో బుద్ధిని నిద్ర లేపడానికి చేసే ధ్యానం లాంటిది అది.
మీ భాగస్వామితో రతి క్రీడ జరుపుతున్నప్పుడు ఒక సమయం ప్రకారం అది పూర్తవుతుంది. మీ భాగస్వామితో ప్రయత్నం చేయడానికి చాలా తాంత్రిక లైంగిక భంగిమలున్నాయి. బాగా ఆదరణ పొందిన భంగిమ మహిళ పైన కూర్చుని ఆచరించేది.
భంగిమ తీరుతెన్నులు..
పడకపై పురుషుడు కాళ్లు పారజాపి కూర్చుంటాడు. మహిళ పురుషుడి ఒడిలో కూర్చుని తన కాళ్లతో అతని నడుమును చుట్టేస్తుంది. బ్యాలెన్స్ కోసం ఆమె అతని చేతులతో అతన్ని పట్టుకుంటుంది. మహిళలు పురుషుడి పైన ఉండి ఆచరించే ఈ భంగిమ చాలా మందికి తెలిసిందే.
ఆ భంగిమను ఎందుకు ఇష్టపడతారు....
మహిళ పూర్తిగా తన దేహాన్ని చుట్టేయడంతో ఆడతనాన్ని పూర్తిగా పురుషుడు అనుభూతి చెందగలుగుతాడు. అతను తన చేతులతో ఆమె దేహాన్ని స్పర్శిస్తూ ఉండడానికి వీలవుతుంది. ఆమె ముఖంలోని ఆనందాన్ని చూడడానికి అవకాశం లభిస్తుంది.
త్వరగా భావప్రాప్తి కలుగుతుంది కాబట్టి మహిళలు దీన్ని ఇష్టపడతారు. వేగాన్ని, కామోద్రేకాన్ని నియంత్రించే క్రియ ఆమె చేతుల్లో ఉంటుంది. పైగా, పురుషుడిపై ఆధిక్య భావన కూడా ఆమెను మరింత ఆనందానికి గురి చేస్తుంది.