బ్రిటిష్ దంపతులు మంగళవారం రతిక్రీడకు ఇష్టపడడం లేదట. ఓ అధ్యయనంలో ఈ విషయం తేలింది. వారం ప్రారంభంలో వారు శృంగారం పట్ల అంత ఆసక్తి ప్రదర్శించడం లేదని అంటున్నారు. నాలుగు శాతం మంది మాత్రమే మంగళవారం సెక్స్ కోరుతున్నారని తేలింది. శనివారం 37 శాతం మంది సెక్స్‌ను ఇష్టపడుతున్నట్లు తేలింది. వారానికి ఒక రోజు 23 నిమిషాలు శృంగారంలో మునిగితేలుతున్నారు. అది కూడా శనివారం రాత్రి 11 గంటల లోపు. లైట్స్ వెలుగులో వారు సెక్స్ చేయడానికి ఇష్టపడుతున్నారట.
తలనొప్పి కారణం చెప్పి సెక్స్‌కు విముఖ ప్రదర్శించేవారు ఒక శాతం మంది మాత్రమే ఉన్నట్లు తేలింది. మహిళ పురుషుడి మీద ఉండి చేసే ఉపరతిని కాంక్షిస్తున్నారట. లైట్ల వెలుతురులో రతిక్రీడకు 66 శాతం మంది బ్రిటిష్ మహిళలు, 88 శాతం మంది బ్రిటిష్ పురుషులు ఇష్టపడుతున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది.
శని, శుక్రవారాల్లో రతిక్రీడను అదరగొట్టడానికి బ్రిటిష్ దంపతులు ఇష్టపడుతున్నారని తేలింది. వారాంతంలో సెక్స్‌కు ఉత్సుకత ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. 37 శాతం మంది శనివారం, 23 శాతం మంది శుక్రవారం సెక్స్‌ను కోరుకుంటున్నారు. సెక్స్‌కు తొలుత ముందుకు వచ్చేవారిలో పురుషులు 79 శాతం కాగా, మహిళలు 46 మంది మహిళలు ఉన్నారు.
అలసట కారణంగానే దంపతులు సెక్స్‌కు దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అలాంటి కారణాన్ని 62 శాతం మంది పురుషులు, 59 మంది మహిళలు చెబుతున్నారు. తలనొప్పి అని కారణం చెప్పి శృంగారాన్ని నిరాకరించేవారి సంఖ్య తగ్గుతోంది. దంపతులు సాధారణంగా టీవీ చూస్తూనో, ఓ గ్లాసెడ్ వైన్ సేవించో నిద్ర పోతున్నారు.
సెక్స్‌లో రోటీన్‌ను దెబ్బ కొట్టడానికి హోటళ్లను (19 శాతం), అవుట్ డోర్స్ (16 శాతం), షోవర్ (16 శాతం), సోఫా (13శాతం), బీచ్ (10 శాతం) కారు (9శాతం), కిచెన్ (7శాతం) వంటి ప్రదేశాలను కోరుకుంటున్నారు
వారం మొదటి రోజు బ్రిటిష్ దంపతులు సెక్స్కు దూరంగా ఉంటున్నారట. దానికి అసలు ఆసక్తి చూపడం లేదని అధ్యయంలో తేలింది.
మంగళవారం ప్రత్యేకమైంది. నాలుగు శాతం మంది రతిక్రీడకు మొగ్గు చూపుతున్నారట.
బుధవారంనాడు కాస్తా లైన్లలోకి వస్తున్నారట. అలసట కారణంగానే రతిక్రీడ పట్ల ఆసక్తి కలగడం లేదని పురుషులతో పాటు మహిళలు కూడా చెప్పారు.
సోమ, మంగళవారాలు దంపతుల్లో ఎక్కువ మంది కనీసం ఒకరినొకరు తాకనైనా తాకడం లేదట. అటూ ఇటూ పొర్లాడి నిద్రపోతున్నారట.
గురువారం కాస్తా ఫరవాలేదట.
వారాంతంలో శృంగారం కోసం ఉబలాటపడుతున్నారు. సాధారణంగా శని, ఆదివారాలు ఆసక్తి చూపుతున్నారని అధ్యయనంలో తేలింది.
శుక్రవారం కూడా దంపతులు శృంగార క్రీడకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారట. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆ టెంపో కొనసాగుతోంది.
మహిళలు పురుషుల కన్నా ఎక్కువగా లైట్ వెలుతురులో సెక్స్ చేయడానికి అంతగా ఆసక్తి చూపడం లేదని తేలింది.
66 శాతం మంది మహిళలు, 88 శాతం మంది పురుషులు వెలుతురులో శృంగారాన్ని ఆస్వాదించడానికి ఇష్టపడుతున్నారట.
దంపతులు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ రతిక్రీడను ఆనందించడానికి వెలుతురును కోరుకుంటున్నారని తేలింది.
36 శాతం మంది చీకట్లో చిందులాటను వాంఛిస్తున్నారు.
దంపతులు రాత్రి 11 గంటలకు ముందే రతిక్రీడను ఆనందించడానికి ముందుకు వస్తున్నారు. వారానికి ఓ రోజు తనివితీరా అనుభవిస్తున్నారట.
శృంగార క్రీడలో తేలియాడే సగటు సమయం 23 నిమిషాలని తేలింది.
మహిళలు పైన ఉండి చేసే ఉప రతిని ఎక్కువగా ఇష్టపడుతున్నట్లు తేలింది.
ముద్దులు ముచ్చట్ల తర్వాతనే క్రమంగా రతిక్రీడలోకి దంపతులు అడుగు పెడుతున్నట్లు తెలుస్తోంది.
పడకున్నప్పుడు సెక్స్ చేయడానికి ముందుకు వస్తున్నట్లుగా 14 శాతం చెప్పారు. ఒకరినొకరు స్పర్శించుకోవడం తదితర పద్ధతులతో తమ రతిక్రీడ ప్రారంభమవుతుందని 12 శాతం మంది అన్నారు.