మన దేహం గురించి మనం తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. చేతులు, వేళ్లు, ఛాతీ ఇలా.. దాని కన్నా ఎక్కువగా జననంగాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. పురుషాంగంపై యువకులకు ఎక్కడలేని అపోహలు ఉంటాయి. బయటపడి అడగలేక లోలోపలే కుమిలిపోతుంటారు. తన పురుషాంగం ద్వారా తన మహిళా భాగస్వామిని సంతృప్తి పరచగలుగుతానా, లేదా అనే ఆందోళన కూడా యువకుల్లో సహజం.
నిజానికి, యోనిలో దానంతట అది శుభ్రం చేసుకునే యంత్రాంగం ఉంటుంది. ఆ విషయం చాలా మంది మహిళలకు తెలియదు. దాంతో పదే పదే నీళ్లతో శుభ్రం చేసుకుంటూ ఉంటారు. అంటే, మన శరీరం గురించి మనకు చాలా విషయాలు తెలియవని అర్థం.
తమ అంగంపై చీరికలు రావచ్చుననే విషయం చాలా మంది పురుషులకు, ముఖ్యంగా యువకులకు తెలియదు. అందువల్ల పురుషాంగం గురించి క్షుణ్నంగా తెలుసుకోవడం చాలా అవసరం.
ఫ్రాక్చర్ కావచ్చు..
అజాగ్రత్తతో కూడిన చర్యల వల్ల పురుషాంగం ఫ్రాక్చర్ కావచ్చు. అందువల్ల పురుషాంగం నొప్పి పెడితే ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. ఆ సమయంలో సంభోగం చేసేటప్పుడు కానీ, హస్త ప్రయోగం చేసేటప్పుడు గానీ జాగ్రత్తగా వ్యవహరించాలి. లేకుంటే తీవ్రమైన పరిణామాలు ఎదురు కావచ్చు.
అంగస్తంభన సమస్య కూడా...
కామోద్రేకం లేకపోవడం వల్లనో, అనారోగ్యం కారణంగానో అంగస్తంభన జరగకపోతే ఫరవాలేదు. అయితే, ప్రతి రోజు మీ మొలభాగం లేవకపోతే అది తీవ్రమైన సమస్యనే. ప్రతి రోజూ అంగస్తంభన కావడం లేదంటే హృదయ సంబంధమైన సమస్య ఉందని గ్రహించాలి. హైపర్ టెన్షన్, డయాబెటిస్ లక్షణాల వల్ల కూడా అలా జరుగుతూ ఉండవచ్చు. అంగస్తంభన సమస్య నిరంతరంగా ఉంటే వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిది.
చన్నీళ్లు శత్రువే...
పురుషాంగం విషయంలో ఈ విషయం చాలా మందికి తెలియదు. తీవ్రమైన చలి, చన్నీళ్లు పురుషాంగంపై ప్రభావం చూపుతాయి. మొల భాగం సమస్యతో పాటు వృషణాలు కూడా సమస్యను ఎదుర్కుంటాయి. సరైన శుక్రకణాల ఉత్పత్తికి వాటిని వేడి చేయాల్సి ఉంటుంది.
పురుషాంగానికి దాని మైండ్ దానికి ఉంటుంది..
ఈ విషయం కూడా చాలా మందికి తెలియదు. పురుషాంగాన్ని నాడీ వ్యవస్థ నియంత్రిస్తుంది. నాడీ వ్యవస్థ ప్రభావం అంగస్తంభనపై చూపుతుంది.
పురుషాంగం వంకర అసాధారణం కాదు...
ప్రతి పురుషుడి మొల భాగం చక్కగా ఉండాలని లేదు. తమ అంగం అరటి పండు లాగా వంకర తిరిగి ఉన్నట్లు చాలా మంది స్తంభన జరిగినప్పుడు గ్రహిస్తారు. ఎప్పుడూ ఆలా ఉంటే పీరోనీ వ్యాధి ఉందనే విషయాన్ని గ్రహించాలి. అంగస్తంభన జరిగినప్పుడు మొల సూటిగా, చక్కగా లేకపోతే తగిన పరీక్షలు చేయించుకోవాలి.