•  

సెక్స్: ప్రతి రోజూ అదరగొడితే ఆరోగ్యం..

రతి క్రీడ ఆనందాన్ని ఇవ్వడమే కాకుండా శరీరానికి ఆరోగ్యం ఇస్తుందని అంటున్నారు నిపుణులు. శృంగారం వయోజనాల పాలిటి వరంగా పనిచేస్తోందట. ప్రతి రోజూ లేదా క్రమం తప్పకుండా దంపతులు శృంగార రసకేళిలో తేలియాడితే ఎక్కడ లేని ఆరోగ్యం ప్రసాదిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడిని దూరం చేయడమే కాకుండా కాలరీలను తగ్గింస్తుంది.



హృదయనాళాల ఆరోగ్యం పెంచుతుంది...



వారానికి రెండు సార్ల కన్నా ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొంటే పురుషులకు గుండెపోటు వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఇటీవలి అధ్యయనంలో తేలింది. నెలకు ఒక్కసారి సెక్స్ చేసే పురుషుడి కన్నా వారానికి రెండు కన్నా ఎక్కువ సార్లు సెక్స్ చేసే వ్యక్తికి గుండెపోటు ప్రమాదం తక్కువని అధ్యయనంలో తేలింది.



reasons you should have sex everyday
 



రోగనిరోధక శక్తిని పెంచుతుంది..



ఎక్కువగా శృంగార క్రీడలో తేలియాడేవారికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సెక్స్ వల్ల యాంటీబాడీ ఇమ్మునోగ్లోబులిన్ పెరుగుతుంది. అది దేహాన్ని శక్తివంతం చేసి జలుబు, జ్వరం వంటివాటిని దూరం చేస్తుంది.



ఒత్తిడిని దూరం చేస్తుంది....



రతిక్రీడలో ఎక్కువగా మునిగితేలేవారు ఒత్తిడికి దూరంగా ఉంటారు. కుటుంబ సమస్యల నుంచి వారికి ఊరట లభిస్తుంది. మూడ్‌ను మెరుగుపరచడమే కాకుండా పడకగదిలో ఎక్కువగా శృంగారాన్ని అనుభవించే వారు ఒత్తిడిని తట్టుకోవడంలో నేర్పరులుగా మారుతారని, ఆనందంగా ఉంటారని అధ్యయనంలో తేలింది.



నొప్పుల నుంచి ఊరట కలిగిస్తుంది...



శృంగారం తలనొప్పుల వంటివాటిని దూరం చేస్తుంది. మీకు రతిక్రీడలో భావప్రాప్తి జరిగే సమయంలో ఆక్సీటోసిన్ అనే హార్మోన్ ఐదు రెట్లు పెరుగుతుంది. ఈ ఎండార్ఫిన్ నొప్పులను తగ్గిస్తుంది.



జీవిత కాలాన్ని పెంచుతుంది..



ఎక్కువ సార్లు సెక్స్ చేసే పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనంలో తేలింది. రతిక్రీడలో భావప్రాప్తి జరిగినప్పుడు డీహైడ్రోపెయిన్‌డ్రోస్టీరోన్ విడుదలవుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచి చర్మాన్ని ఆరోగ్యకరంగా ఉంచుతుంది. వారానికి రెండు సార్లు సెక్స్ చేసే వ్యక్తి జీవితకాలం పెరుగుతుంది.



రక్తప్రసరణ పెరుగుతుంది...



శృంగార క్రీడలో హృదయ స్పందనల వేగం పెరుగుతుంది. దేహంలోని అంగాలకు, కణాలకు తాజా రక్తం ప్రసరిస్తుంది. చెడు రక్తం వెళ్లిపోయి అలసటకు గురిచేసే టాక్సిన్స్, ఇతర పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.



Read more about: kamasutra, sex drive
English summary

 If you thought that the only benefit of sex was, well, pleasure, here's some news for you. Making love is good for adults. And making love regularly is even better.
Story first published: Thursday, March 21, 2013, 15:06 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras