నఖ, దంత క్షతాలలో ఎన్నో రకాలున్నట్టే చిరు దెబ్బల్లో కూడా అనేక రకాలున్నాయని, ఒక్కో దెబ్బకు ఒక్కో లక్షణం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. శృంగార క్రీడ కూడా యుద్ధం వంటిదే. ప్రేయసీప్రియులిరువురూ ఒకరినొకరు వెక్కిరించుకుంటూ, కలహించుకుంటూ రతిలో మునిగి తేలుతూ ఆనందాన్ని పొందుతారు. ఈ సమయంలో చిరు దెబ్బలు ప్రముఖ పాత్ర వహిస్తాయి.
చిరుదెబ్బలను సాధారణంగా స్త్రీపై పురుషుడు ప్రయోగిస్తుంటాడు. నఖ, దంత క్షతాలకు మాదిరిగా వీటిని ప్రయోగించడానికి స్త్రీ దేహంపై నిర్ణీత భాగాలున్నాయి. అవి - భుజాలు, శిరస్సు, స్థనాల మధ్య, వీపు, కటి . ఈ ప్రదేశాలలో చిరు దెబ్బలు స్త్రీకి అపరిమితమైన సుఖాన్ని, సంతోషాన్ని ఇస్తాయి. ఈ ప్రదేశాలలో స్త్రీపై పురుషుడు ప్రయోగించే చిరుదెబ్బలనే ప్రహరణాలు అని పిలుస్తారు.
వీటిలో అనేక రకాలున్నాయి. అందులో మరీ ముఖ్యమైనవి నాలుగు. అవి - అపహస్తకం, ప్రసృతకం, ముష్టి, సమతలకం అపహస్తకం అంటే అరచేతి వెనుక భాగంతో చరచడం. ఈ దెబ్బలో చేతి వేళ్లు మాత్రమే తగులుతాయి. ముష్టి అంటే పిడికిలితో చరచడం. ఇక అరచేతిని చాచి స్థనాలను మర్దించం సమతలకం. రతికి తోడు ఈ చిరుదెబ్బల వల్ల కలిగే సుఖం వల్ల స్త్రీ పారవశ్యంతో చేసే ధ్వనులే కూజితాలు. ఈ కూజితాల ద్వారా మహిళ వ్యక్తం చేసే ఆనందం పురుషుడి ఉత్సాహాన్ని పెంచుతుంది.