శృంగారంలో ముద్దులకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. ముద్దులతో ముంచెత్తనిదే శృంగారం పతాక స్థాయికి చేరుకోంది. మహిళ శరీరంలోని కొన్ని భాగాలను ముద్దులతో ముంచెత్తితే రతి కార్యం రంజుగా సాగుతుంది. మహిళలనే కాదు, పురుషులను కూడా ముద్దులు మత్తెక్కిస్తాయి. మరులు గొలుపుతాయి.
మీ పురుషుడిని మీ సొంతం చేసుకుని, అతనితో రతి కార్యాన్ని సాగించాలంటే కొన్ని శరీర భాగాలపై చుంబనాలతో అదరగొట్టండి. ముద్దులతో భామామణి ముడుచుకుపోతుంది. దగ్గరికి రమ్మని అది ఆహ్వానించడం లాంటిది.
మహిళ తనంత తానుగా ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వస్తే వద్దనే మగాడు ఉండడు. తన్వయత్వంతో తల్లడిల్లిపోయి, కామోద్రేకంతో రగిలిపోతాడు. పురుషుడి శరీరం కూడా స్పర్శను కోరుతుంది. ముద్దుల ముచ్చటను కోరుతుంది. అతని శరీరంలోని చాలా భాగాలు ముద్దులకు తన్వయత్వం పొందుతుంది.
ముద్దులతో ముంచెత్తే భామామణిని పురుషుడు తన కౌగిట్లో బంధించి, శృంగార ప్రవాహంలో ముంచి తేలుస్తాడు. అలాంటి మహిళపై ద్విగుణీకృతమైన ఉద్రేకంతో ఉరకలు వేస్తాడు.

పెదవులు: సాధారణంగా ముద్దులకు అత్యంత ముఖ్యమైనవి. అత్యంత మోహంతో దంపతులు పెదవులతో పరస్పరం ముంచెత్తుకోవచ్చు

చెవుల వెనక భాగాలు: చెవుల వెనక భాగాలు స్పర్శకు పులకరించిపోతాయి. మహిళలు తన పురుషుడిని రెచ్చగొట్టడానికి చెవుల వెనకభాగాలను ముద్దులతో తడిపేయవచ్చు.

మెడ మూపు: మీరు మెడ మూపు మీద ముద్దులు పెడితే అతను మరో లోకంలోకి వెళ్లిపోతాడు. మీకు వశమైపోతాడు. మహిళలకు ఆ భాగంలో పురుషుడు ముద్దు పెడితే మురిపెమే. ఇక్కడ సున్నితంగా ముద్దులు పెట్టాలి.

పాదాలు: పాదాలపై ముద్దు పెడితే కూడా పురుషుడిలో కామోద్రేకం కట్టలు తెంచుకుంటుంది. బాడీ లోషన్‌తో పాదాలపై మాసాజ్ చేస్తూ అకస్మాత్తుగా ముద్దులు పెట్టి అతన్ని ఆశ్చర్యచకితుడ్ని చేయవచ్చు. దీంతో అతనిలో కామోద్రేకం ఉరకలు వేస్తుంది.

లోని తొడలు: లోని తొడలపై ముద్దులు పెడితే అతను కామోద్రేకంతో బుసలు కొడతాడు. మిమ్మల్ని ఆక్రమించడానికి దూసుకుని వస్తాడు. మహిళ తొడలపై పురుషుడు ముద్దుల పెడితే ఆమో పరవశంతో తీయటి కూజితాలు చేస్తుంది. మైకంలో మిమ్మల్ని తీగెలా అల్లుకుపోవడానికి ఉత్సాహ పడుతుంది.

పొట్ట: పురుషుడి పొట్ట భాగంపై ముద్దులు పెడితే అతను కామవాంఛతో రగిలిపోతాడు. నాలుకను కూడా వాడి అతనిలో కామోద్రేకం ఉప్పొంగేలా చేయవచ్చు.

ఛాతీ: మహిళ తన ఛాతీపై ముద్దులు పెడితే అతను మన్మథ సామ్రాజ్యాన్ని పాలించడానికి ఉరకలు వేస్తాడు. అతని చనుమొనలను నాలుకతో చీకితే అతనిలో కామోద్రేకం ఉప్పొంగుతుంది. పెదవులు, నాలుక వాడి అతన్ని రెచ్చగొట్టవచ్చు.