•  

శృంగారం: కళ్లలో కళ్లు పెట్టి చూడు.. కలిపికొట్టు..

పురుషులు మామూలుగానే క్రేజీగా ఉంటారు. తనకు ఇష్టమైన మహిళ క్యాజువల్‌గా టీ షర్ట్, జీన్స్ ధరించి డోంట్ కేర్ అన్నట్లుగా ముందుకు వస్తే పురుషుడికి మరింత క్రేజ్ పుడుతుంది. మీ పురుషుడు మీ పట్ల మరింత ఆసక్తి, అనురాగం ప్రదర్శించాలంటే మీరు గుర్తించాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఎక్కువ శ్రద్ధ అవసరం లేకుండానే అతన్ని పడేయడం ఎలాగో తెలుసుకోండి.చాలా మంది యువతులు పురుషుడి ముందుకు వెళ్లేందుకు బాగా మేకప్ చేసుకోవాలని అనుకుంటారు. మీ కన్నులు మత్తు గొలిపే విధంగా, పౌడర్ రుద్దుకున్న ముఖంతో ప్రత్యేకంగా ఏమీ కనిపించాల్సిన అవసరం లేదు. డబ్బుకు డబ్బు, సమయానికి సమయం ఆదా చేసి మీ పురుషుడిని అతి సాధారణంగా పడేయవచ్చు, ప్రయత్నించండి.డ్రెస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాల్సిన అవసరం లేదు. బ్రా, ఇతర దుస్తులు మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలని అనుకుంటారు. కానీ, ప్రత్యేకంగా మీరు ఏమీ శ్రద్ధ తీసుకోలేదనే విధంగా దుస్తులు ధరించి డోంట్ కేర్ అనేట్లుగా అతనికి ఎదురుపడండి.శారీరకంగా దగ్గరయితేనే పురుషుడు పడిపోతాడని అనుకుంటారు. కానీ, జోక్ కట్ చేయండి, నవ్వును మెరుపులా సంధించండి. అంతే, అతను ఫ్లాట్ అవుతాడు.

Weird things Men like in Women
 ఫ్లాట్‌గా ఉండడం, జీరో సైజుకు రావడం వల్ల పురుషులను ఆకర్షించాలని అనుకోవద్దు. మీ దేహం మీది ముడుతలు అతన్ని ఎక్కువగా ఆకట్టుకుంటాయి. శరీరం కదిలితే నడుం మీద కర్వ్స్ వస్తే అతను ఏ లోకంలోకో వెళ్లిపోతాడు.తెలివి, విశ్వాసం, ఉద్వేగభరితమైన పరిపక్వతను చాటుకోండి. అతను డీలా పడినప్పుడు సెక్సీగా మాటలు చెప్పండి. ముద్దు చేయండి. చాలు, అతను ఒళ్లో వాలిపోతాడు, చిన్నపిల్లాడిలా...పడక మీద కూడా క్యాజువల్‌గా ఉండండి. నీ సాన్నిహిత్యమే మీకు కావాలని చెప్పండి. మీలోని ప్రతి ఒక్క విషయం అతను గుర్తించి, మీతో చెప్పాలని అనుకోకండి.జట్టు నున్నగా దువ్వుకుని జడ వేయడమో, కొప్పు పెట్టడమో చేయాల్సిన అవసరం కూడా లేదు. మీ తల వెంట్రుకలను అలా వదిలేయండి. గాలికీ.. అతనికీ..మీ కళ్లను అతని కళ్లతో కలపండి. అతనిపై మీకు ఆసక్తి ఉన్నట్లు చెప్పడానికి కళ్లతో కళ్లు కలపడం అత్యంత పదునైన ఆయుధం... ఇవన్నీ ఓసారి ట్రై చేయండి. మీ పురుషుడు మీ ఒళ్లోకి వచ్చి వాలడమే కాదు, అతనికి మీరే సర్వస్వం అవుతారు.

English summary
Men are crazy. And they get crazier when they see you approach them in those red pumps and skinny jeans with a baggy and casual tee in style and confidence.
Story first published: Friday, January 11, 2013, 13:19 [IST]
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras