చక్ర భంగిమ:
రతి కార్యంలో ఉత్సాహాన్ని, ఉత్కంఠను కలిగించే భంగిమ ఇది. అయితే ఈ భంగిమకు శారీరక బలం, వెన్నముకసు బలంగా వంచే లక్షణం, శక్తి చాలా అవసరం. అందువల్ల ఈ భంగిమకు ఎంతో ఓర్పు, సాధన కావాలి. కోబ్రా, ఒంటె, వెనక్కివంగడం మొదలైన వ్యాయామాలు ఈ భంగిమకు ఎంతో ప్రయోజనకరమైన అభ్యాసాన్ని ఇస్తాయి.
ముందుగా స్ర్తీ వెల్లకిలా పడుకోవాలి. తన చేతులను తల మీదుగా పైకి చాపి ఉంచాలి. తన చేతుల పై భాగం తన రెండు చెవులను తాకుతూ వెళ్ళే విధంగా చాపాలి. తర్వాత అరచేతులను నేల మీద ఆన్చి పిరుదులను గాలిలో పైకి లేపి, శరీరం మొత్తం వ్యతిరేక దిశలో, అర్థచంద్రాకృతిలో వంగే విధంగా నిలబడాలి. ఛాతీ వద్ద పూర్తిగా వెనక్కి వాలాలి. అలా వెనక్కి వాలినపుడు తన తలను తలకిందులుగా వంచాలి. ఈ భంగిమలో ఆమె శరీరం ఒక చక్రం మాదిరిగా వంపు తిరిగి ఉంటుంది.
ఈ భంగిమలో స్ర్తీ తన బ్యాలెన్స్‌ను సరిచూసుకున్న తర్వాత, పురుషుడు ఆమె తొడల మధ్య మోకాళ్ళపై కూర్చోవాలి. ఒక కాలిని ముందుకు జరిపి ఉంచాలి. మరొక కాలిని వెనక్కి పెట్టి, ఆ కాలి యొక్క మోకాలిని నేలపై ఆన్చాలి. ఆమె తొడల మధ్యకు ముందుకు జరిగి, ఆమె నడుమును రెండు చేతులతో పట్టుకోవాలి.
ఆ తరువాత పురుషుడు బ్యాలెన్స్‌ చూసుకుని నెమ్మదిగా పైకి లేపాలి. ఆమె పిరుదులను ఒక చేత్తో పట్టుకొ ని, మరొక చేత్తో ఆమె వీపును పట్టుకుని సపోర్టు ఇస్తూ లేవాలి. అతను లేచే సమయంలో తన కుడికాలిని అతని నడుం చుట్టూ వేయాలి.
పురుషుడు పూర్తిగా లేచే సమయంలో ఆమె బరువును సులువుగా ఎత్తుకున్నా, ఆమె తన రెండవ కాలిని కూడా అతని నడుము చుట్టి, రెండు కాళ్ళను అతని వీపు వైపు, పిరుదుల మీద పెనవేయాలి. ఈ దిశలో పురుషుడు నిటారుగా నిలబడి మోకాళ్ళను కూడా వంచకుండా వెన్నెముకను తిన్నగా ఉంచి నుంచుంటాడు.
ఈ రతిభంగిమలో మహిళకు కాస్తా శక్తి ఎక్కువే కావాలి. ఆమె శరీరం ఎటు పడితే అటు వంగడానికి వీలుగా ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఇది యోగాభ్యాసం చేసేవారికి ఎక్కువగా పనికి వస్తుంది. అటు యోగా చేసిన ఫలితం, ఇటు సుఖప్రాప్తి లభిస్తుంది. అందువల్ల అతి కష్టం మీద దీన్ని ఆచరించడం మంచిది కాదు. మీ శరీర లక్షణాన్ని బట్టి దీన్ని ఆచరించండి.