"నేను నా లవర్‌తో సెక్స్ చేద్దామంటే అక్కడ పెడుతుంటే నొప్పి వస్తోందని తాను అంటుంది నాకేమో తనని అంత కష్టపెట్టాలని లేదు. దీనికేమైన పరిష్కారం చెబుతారా?" అంటూ ఓ పాఠకుడు రాశాడు..
అంగప్రవేశం వల్ల కలిగే నొప్పికి స్త్రీలు సాధారణంగా భయపడుతారు. లైంగిక క్రీడ ప్రారంభ దశలో రెండు, మూడు సార్లు నొప్పి అనిపిస్తుంది గానీ ఆ తర్వాత నొప్పే మధురమనే స్థాయికి వచ్చేస్తామనే విషయాన్ని మహిళలు గ్రహింపులోకి తెచ్చుకోవాలి. నొప్పి కలుగుతుందంటే అది సహజమేనని అనుకోవాలి.
నిజానికి, ఆమె లైంగిక క్రీడకు ముందుకు రాకపోవడానికి కారణాలు కేవలం యోని మంటలేనా, అది మానసికమైందా అనే విషయం తెలుసుకోండి. మానసికం కాకపోతే, అంటే బిడియాలు, ఆందోళలను రతిక్రీడలో పాల్గొనడాకి ఆటంకాలు కావని తెలుసుకుంటే, ఆ మంటలు దైహికపరమైనవని గమనించాలి. రెండు మూడుసార్లు రతిక్రీడ జరిపిన తర్వాత కూడా మంటలు తగ్గకపోతే, అది తీవ్రమైన ఇబ్బందిగా ఉంటే ఈ కింది చిట్కాలు పాటించాలని మీ ప్రియురాలికి చెప్పండి.
చముర్లు వాడండి
పొడి యోని సమస్యను పరిష్కరించుకోవడానికి ఇది సాధారమైన పద్ధతి. సంయోగ క్రియ యోని మారడం వల్ల అసంభవంగా మారుతుంది. క్రీమ్స్, జెల్స్ వంటివాటిని వాడండి. ఇవి మార్కెట్లో సులభంగా దొరకడమే కాకుండా సెక్స్ చేసే సమయంలో మంటలను నివారిస్తాయి. అప్పటికప్పుడు అటువంటి చముర్లు లేకపోతే బాడీ లోషన్ వాడండి. బాడీ లోషన్ తాత్కాలిక ఉపశమనానికి మాత్రమే పనికి వస్తుంది.
సుగంధాలను స్నానంలో వాడకండి
విపరీతమైన సుగంధాలను వెదజల్లే సబ్బులను లేదా ఇతర సుగంధ ద్రవ్యాలు స్నానం చేసేటప్పుడు వాడడం మానేయండి. స్నానం చేసిన తర్వాత శరీరం పరీమళాలతో సువాసనలను వెదజల్లాలనే కోరికను తగ్గించుకోండి. ఈ సుగంధ ద్రవ్యాలు తేమను శరీరం నుంచి, ముఖ్యంగా యోని నుంచి తొలగిస్తాయి. అందువల్ల యోని మంటల సమస్యను ఎదుర్కునేవారు స్నానం చేసేటప్పుడు సుగంధ ద్రవ్యాలకు దూరంగా ఉండడం మంచిది.
మంచినీళ్లు తాగండి
శరీరంలో తగిన మోతాదులో నీరు లేకపోవడం వల్ల కూడా యోని డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి తగినంతగా మంచినీళ్లు తాగండి. మంచినీళ్లే కాకుండా తరుచుగా జ్యూస్, కొబ్బరి నీళ్ల వంటివి తీసుకోవడం మంచిది.
డాక్టర్‌ను సంప్రదించండి
ఆ నివారణ మార్గాల ద్వారా కూడా సమస్య పరిష్కారం కాకపోతే డాక్టర్‌ను సంప్రదించండి. యోనిలో ఇన్‌ఫెక్షన్ వల్ల సాధారణ మార్గాల్లో మంటలు తగ్గకపోవచ్చు. అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాల్సిందే. ఈ ఇన్‌ఫెక్షన్ శరీరంలో తగినంత నీరు లేకపోవడం వల్ల లేదా కండోమ్స్ వల్ల సంభవించవచ్చు. పొడి యోని వల్ల మహిళలకు మంటలు పుట్టడమే కాకుండా పురుషుడికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది. పురుషాంగం కూడా మంట పుడుతుంది.
ఆమెకు శృంగారంలో పాల్గొనడానికి మానసికంగా ఇష్టం లేకపోతే, యోని నొప్పి వస్తుందనేది నిజం కాదు. అప్పుడు అందుకు గల మానసిక కారణాలేమిటో వివరించడానికి వీలవుతుంది.