సాయంత్రం వేళ ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటివాటితో మీరు కాలం వెల్లబుచ్చినట్లయితే మీ శృంగారక్రీడ గోవిందా అన్నట్లే. మీ మహిళతో ముచ్చట్లు చెబుతూ ఆమెకు మీరు సన్నిహితం కావడానికి బదులు సామాజిక వెబ్‌సైట్లతో మునిగిపోతే మీరు ఆమెకు దూరం అవుతున్నట్లేనని నిపుణులు అంటున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు బానిసలపై మీ లైంగిక జీవితం దెబ్బ తినడం ఖాయమని చెబుతున్నారు
లైంగిక జీవితం ఎజెండాగా ఉండాల్సిన పడక గది స్మార్ట్‌ఫోన్ కారణంగా అందుకు భిన్నంగా తయారవుతుందని అంటున్నారు. స్మార్ట్‌ఫోన్లను నిరంతరాయంగా చెక్ చేసుకుంటూ మీకు వచ్చిన సందేశాలను చూస్తూ, మీరు సందేశాలు పంపుతూ ఉండడం వల్ల శృంగార క్రీడలో అంతరాయాలు ఏర్పడుతాయి. దాంతో మీ భాగస్వామి తీవ్ర అసంతృప్తికి గురువుతుందనేది నిస్సందేహం.
వాస్తవ ప్రపంచానికి అటువంటి దూరమవుతారని కూడా డైలీ మెయిల్ రిపోర్టు వ్యాఖ్యానించింది. ఇతరులతో సంబంధాలు కలపడానికి స్మోర్ట్‌ఫోన్లు బాగా పనికి వస్తాయని,త అయితే, అది మితిమీరితే వ్యక్తిగత సంబంధాలు బీటలు వారుతాయని చార్టర్డ్ సైకాలజిస్టు థామస్ స్టీవార్ట్ అన్నారు.
స్మార్ట్‌ఫోన్‌తో మీరు బిజీగా ఉన్నారంటే, మీ భాగస్వామిని మీరు నిర్లక్ష్యం చేస్తున్నట్లే లెక్క. దానివల్ల మీ భాగస్వామికి మీపై కోపం పెరగడమే కాకుండా ఆమె అసంతృప్తికి గురుయ్యే ప్రమాదం ఉంది. పైగా, దానికి బానిసలైతే ఎక్కడెక్కడికో వెళ్లిపోతారు. మీ పక్కన ఉన్న మీ మహిళను మరిచిపోతారు.