•  

శృంగారం: స్త్రీ గుట్టు మగాడికి ఎరుక

శృంగారంలో తన స్త్రీని ఎలా సంతోషపెట్టాలో మగాడికి బాగా ఎరుక ఉండాలి. కేవలం సంభోగంలో అంగ ప్రవేశం ద్వారా మాత్రమే మహిళ భావప్రాప్తిని, ఆనంద పారవశ్యాన్ని పొందలేదనే విషయాన్ని పురుషుడు ప్రాథమికంగా తెలుసుకోవాల్సిన విషయం. మహిళకు సంబంధించిన కొన్ని రహస్యమై విషయాలు అతను తప్పకుండా తెలుసుకుని ఉండాలి.మాటలతో మంత్రముగ్ధులు..మహిళలు తమ పురుషుడు తమతో సంభాషణ జరపడాన్ని ఎక్కువగా ఇష్టపడుతారు. వారు చెప్పే విషయాలను శ్రద్ధతో వినాలి. ఇద్దరు కలిసి నడుస్తున్నప్పుడు లేదా తీరికగా కూర్చున్నప్పుడు వారిని మాటల్లోకి దించాలి. తాను ఆమెను ఎంతగా ప్రేమిస్తున్నానో చెప్పాలి. తనకు అత్యంత ఆత్మీయురాలు ఆమె తప్ప మరెవరూ లేరని నమ్మబలకాలి.

Sex secrets Women want Men to know
 చూపుల చురకత్తులూ...ఇద్దరు కలిసి ఉంటున్నప్పటికీ కొన్నిసార్లు అతను తనను పట్టించుకోవడం లేదనే భావనకు ఆమె గురవుతుంది. అందువల్ల, అప్పుడప్పుడు ఆమె వైపు చూపుల చురకత్తులతోనో, ఆరాధనా భావంతోనో కదిలించాలి. దాదాపుగా ఎవరికీ కనిపించకుండా జాగ్రత్త పడి మహిళ దుస్తులు విప్పేస్తుంది. అటువంటి వేళల తనకు చూడాలని ఉందనే ఆకాంక్షను తమ చూపుల ద్వారా పురుషుడు వెల్లడించాలి. చాలా అందంగా ఉన్నావంటూ ప్రశంసించాలి.జీవితం నుంచి శృంగారాన్ని విడదీయలేం...మహిళకు శృంగారం మిగతా జీవితంతో వేరు కాదు. దాన్ని కూడా ఆమె తన నిత్య జీవితంలో భాగంగానే చూస్తుంది. రతిక్రీడ ద్వారా జీవితంలోని ఇతర ఒత్తిళ్లకు దూరమయ్యేలా ఆమెను ప్రోత్సహించాలి. మంచి భావనల వల్ల, అనుభవం వల్ల ఆమె సెక్స్‌లో సంతృప్తి పొందుతుంది. కఠినంగా మాట్లాడడం, దూరంగా నెట్టేయడం, విమర్శించడం వంటివి ఆమెపై తీవ్రమైన ప్రతికూల ప్రభావం చూపుతాయి. శృంగారంలో పూర్తి సానుకూలతతో పాల్గొనేలా ఆమెను సిద్ధం చేయాలి.స్కలనం ఆమెకు ముఖ్యం కాదు....స్కలనంతో స్త్రీ సంతృప్తి చెందుతుందనే తప్పుడు భావనతో చాలా మంది పురుషులు ఉంటారు. అది అవసరమే. కానీ అన్ని సందర్భాల్లో అదే అంతిమం కాదు. భాగస్వామి నుంచి స్పర్శను, ఒత్తిడిని మహిళ కోరుకుంటుంది. కొన్ని సార్లు సంభోగం అవసరం లేని ఫోర్ ప్లేను మహిళ ఇష్టపడుతుంది.సెక్స్ సీరియస్ చర్య కానక్కర్లేదు..తన శరీరంతో తన పురుషుడు ఆటాడుకోవడాన్ని మహిళ ఇష్టపడుతుంది. లైంగిక క్రీడ జరిపే సమయంలో చాలా మంది పురుషులు ముభావంగా, సీరియస్‌గా ఉంటారు. నవ్వడాన్ని మరిచిపోతారు. పురుషులు తన మహిళతో సరససల్లాపాలు జరపాలి. దానివల్ల మహిళ అత్యంత సాన్నిహిత్య భావనకు గురై మీకు హత్తుకుపోతుంది. దానివల్ల ఇరువురి ఒత్తిడి కూడా తొలుగుతుంది.సంభోగం అక్కర్లేని స్పర్శ...మహిళలు సరసల్లాపాలను, కౌగిలింతలను, ముద్దులను, హత్తుకోవడాన్ని ఇష్టపడుతారు. ఫోర్‌ప్లే సందర్భంలో తప్ప ఇతర సమయాల్లో పురుషులు ఈ పని చేయరనేది మహిళల ఫిర్యాదు. స్పర్శను ఆమెను కోరుకుంటుంది. తల వెంట్రుకలను సున్నితంగా చేతులతో దువ్వడం, యాదృచ్ఛికంగా ఆమెను స్పర్శించడం వంటివి చేయాలి.రతిక్రీడ తర్వాత సహృదయ దృష్టిసంభోగం అయిపోగానే తన పని అయిపోయినట్లుగా చాలా మంది పురుషులు పక్కకు తిరిగేసి పడుకుంటారు. రతిక్రీడ తర్వాత పురుషుడు తన మహిళను సహృదయ దృష్టితో చూడాలి. రతిక్రీడ అయిపోగానే తన పురుషుడు గుర్రు పెట్టి నిద్రపోతాడనే ఫిర్యాదు మహిళల నుంచి వస్తుంటుంది. రతిక్రీడ తర్వాత పురుషుడి ఎండోర్ఫిన్ స్థాయి ఎక్కువ మోతాదులో ఉంటుంది. దానివల్ల స్కలనం జరిగిన వెంటనే విశ్రాంతి కావాల్సి ఉంటుంది. అంగస్తంభన ఆగిపోతుంది. నిజానికి అతనికి చేష్టలుడిగిన స్థితి వచ్చేస్తుంది. ఈ స్థితి మహిళల్లో ఒకేసారు రాదు, క్రమంగా ఆ స్థితికి ఆమె చేరుకుంటుంది. అందువల్ల పురుషుడు కొంత శ్రద్ద పెట్టి ఆమెను పట్టించుకోవాలి. అయితే, మహిళలు చేయాల్సిన పని కూడా ఒకటి ఉంది. తన చేతుల్లోనే పురుషుడు నిద్ర పోయేలా చూసుకుని, ఆ తర్వాత మెల్లగా లేపితే మంచిది.

English summary
Many women find talk a great turn-on. For them, talking and feeling loved are very important. Good conversation during walks or while the couple is relaxing can be a great aphrodisiac. A man could tell his woman how much he loves her, which acts as a reassurance that he is with her mentally during those intimate moments.
Please Wait while comments are loading...

Get Notifications from Telugu Indiansutras