అధునిక లైంగిక జీవితంలోనూ మార్పులు తెచ్చింది. చాలా మంది పురుషులు, మహిళలు సంప్రాదయబద్దమైన లైంగిక క్రీడకు తిలోదకాలు ఇచ్చి ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నారు. సంప్రదాయేతర పద్ధతుల్లో సంభోగం చేసి భావప్రాప్తికి చేరుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అంగస్తంభనకు వయాగ్రా వాడడం ఇటువంటిదే.
కరేజా అనేది దంపతులు సహజసిద్ధంగా రతిక్రీడలో భావప్రాప్తిని సాధించి, దంపతులు ఇద్దరు సమాన స్థాయి సుఖాన్ని పొందేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు. కరేజా అనేది ఇటాలియన్ పదం నుంచి పుట్టింది. కరేజా అంటే అప్యాయత, శ్రద్ధ పెట్టడం అని అర్థం. ఇది స్త్రీపురుషుల లైంగిక క్రీడలో మందులాగా పనిచేస్తుందని నిపుణులు తేల్చారు.
కరేజాకు ఆ పేరును డాక్టర్ అలైస్ బంకర్ స్టాక్‌హోమ్ 1896లో నిర్ధారించారు. చికాగో వైద్య నిపుణులు, ఫెమినిస్టు అయిన బంకర్ స్టాక్ హోమ్ జనన నియంత్రణ వంటి వాటిని నియంత్రించి దంపతులు సహజమైన పద్ధతిలో శృంగార రసాన్ని ఆస్వాదించే మార్గం అది. లైంగిక సంతృప్తి పొందడానికి సూచించిన మార్గం కరేజా. వివాహబంధాన్ని పటిష్టం చేసి, పురుషుల నిగ్రహ శక్తిని ప్రోత్సహిస్తుంది. తద్వారా పురుషుడితో సమానంగా సెక్స్‌లో మహిళ ఆనందం పొందడానికి ఉపయోగ పడుతుంది.
కరేజాను వయాగ్రాకు సహజమైన ప్రత్యామ్నాయంగా వైద్య నిపుణులు భావించి, ప్రశంసించారు. లైంగిక బలహీనత, మహిళల్లో లైంగిక వాంఛ కొరవడడం వంటివాటికి చికిత్సగా కూడా దాన్ని పరిగణిస్తారు. వివాహ బంధాన్ని కరేజా పటిష్టం చేస్తుందని డెబ్ ఫీంటెక్ అభిప్రాయపడ్డారు. పురుషులకు ఇది బాగా నచ్చింది. దీన్ని పురుషులు విప్లవాత్మకంగా చూశారని, ఉద్వేగపూరితమైన సాన్నిహిత్యాన్ని అది బోధిస్తుందని, చేజ్‌ను అది అధిగమించి, బుద్ధిని నియంత్రిస్తుందని ఆమె అన్నారు.
అయితే, ఇది యువ జంటలకు పెద్గగా ఉపయోగపడదని, వివాహ బందంతో విసిగిపోయి లైంగిక జీవితం రోటీన్‌గా మారిన మధ్య వయస్కులకు బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. అయితే, యువజంటలకు తమ పద్ధతులను మార్చుకోవడానికి పనికి వస్తుందట.
ఒక నెల ప్రయత్నిస్తే చాలా మార్పు ఉంటుందని అంటున్నారు. ప్రతి ఉదయం జననేంద్రియ ప్రేరణ గురించి ఆలోచన లేకున్నా సరే, కనులు కనులు కలపడం, శ్వాస తీసుకోవడం వంటి ప్రక్రియల ద్వారా గుండె నుంచి చైతన్యం జననేంద్రియాలకు ప్రవహిస్తుందని, తద్వారా శృంగార వాంఛలు రేకెత్తి దాంపత్య బంధం బలపడుతుందని ఆమె అన్నారు. మొత్తం మీద, దంపతులు పరస్పరం శ్రద్ధతో గమనించుకోవడం, ఆప్యాయతను ప్రదర్శించడం అనేది ఇందులో అత్యంత ముఖ్యమైన విషయం.