సంసారంలో ఎదురయ్యే సమస్యలను తమ దృష్టి కోణం నుంచే ఆలోచిస్తుంటారు. అంతే తప్ప భార్య దృష్టి కోణం నుంచి ఆలోచించరు. ఫలితంగా ఇద్దరి మధ్య వివాదాలు చెలరేగుతుంటాయి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం కూడా తగ్గుతూ పోతుంటుంది.
ప్రధానంగా బాడీ ఇమేజ్‌కి సంబంధించిన సమస్య ఉన్న వారిలో ఈ విధమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. తన అందం. సౌష్టవం, ఆకర్షణ శక్తి తగ్గిపోయాయని, చలాకీగా సెక్సుని అనుభవించి, ఆనందించే వయస్సు దాటి పోయిందని చాలా మంది మహిళలు అనుకుంటూ ఉంటారు.
తమ భర్తలతో పాటు పిల్లల పెంపకం బాధ్యతలు, ఇంటి బరువు... ఇవన్నీ మోస్తున్నందు వల్ల ఈ వయస్సులో స్త్రీలకు మానసిక ఒత్తిడి, శారీరక అలసట ఎక్కువ ఉంటాయి. ఈ విషయాన్ని భర్త గుర్తించాల్సి ఉంటుంది. అదే సమయంలో భార్య ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
పురుషుడు తన భార్యకు ఆనందం కలిగించే పనులు చేస్తూ ఉండాలి. భార్యలో కనిపించే ఆకర్షణీయమైన అంశాలు ఏవైనా ఉంటే వాటిని మెచ్చుకోవడానికి ఇష్టపడాలి. మీరు మీ పట్ల కూడా శ్రద్ధ వహించి ఎల్లప్పుడూ ట్రిమ్‌గా, నీట్‌గా, హూందాగా ఉండటం అలవరచుకోవాలి. పిల్లల గురించి, ఇంటి గురించి శ్రద్ధ వహించాలి.
కోర్కెలు అందరిలోనూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. చిన్నప్పుడు వారు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉండే పరిస్థితులు ఇందుకు కారణం కావచ్చు. ఇలాంటి సందర్భాల్లోనే దంపతులు మనస్సు విప్పి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతోంది. పరస్పరం మనస్సు విప్పి మాట్లాడుకుంటే ఈ విధమైన సమస్యలు తలెత్తవు.
ప్రధానంగా ఇంట్లో చిన్న పిల్లలు ఉండడం, అత్తామామలతో కలసి ఉండడం వంటి కారణాలతో భార్యకు ఆ విషయంలో రకరకాల పరిమితులు ఏర్పడే అవకాశం ఉంది. వీటన్నింటినీ మగవారు దృష్టిలో ఉంచుకోవాలి. ఒకరికొకరు సర్దుబాటు ధోరణితో వ్యవహరించుకోవడం వల్ల సమస్యలను పరిష్కరించుకోవచ్చని మానసిక నిపుణులు చెపుతున్నారు.