శృంగారంలో క్లైమాక్స్‌కు చేరుకోవడమనేది ఒక అద్భుతమైన అనుభూతి. సెక్స్‌లో మహిళ భావప్రాప్తి పొందినప్పుడు, సెక్స్‌లో క్లైమాక్స్‌కు చేరుకున్నప్పుడు సన్నగా మూలుగుతుంది. ఉచ్ఛ్వాసనిశ్వాసలు పెరుగుతాయి. కామోద్రేకం ఉరకలు వేసే సమయంలో సంతృప్తి పొందడానికి తగిన లైంగిక క్రీడ, రతి భంగిమలు, చర్యలు అవసరం.
రతిక్రీడలో పాల్గొంటున్నప్పుడు మహిళలు ఆలోచనలు తగ్గించి దాన్ని అనుభూతి చెందడం మీదనే దృష్టి కేంద్రీకరించాలి. దాని వల్ల సెక్స్‌లో త్వరగా క్లైమాక్స్‌కు చేరుకోవడం సులభమవుతుంది. రతిక్రీడ ఎలా చేయాలనే విషయంపై ఆలోచన మానేయాలి. నిజానికి, లైంగిక క్రీడకు ప్రారంభం, మధ్యమం, ముగింపు ఏవీ ఉండవు. ఫోర్‌ప్లే ద్వారా కూడా ఒక్కోసారి క్లైమాక్స్‌కు చేరుకోవచ్చు.
రతిక్రీడలో ప్రయోగాలను వదులుకోవద్దు. కొత్త పద్ధతులను అనుసరించడానికి వెనకాడకూడదు. ఏ రకంగా త్వరగా క్లైమాక్స్ చేరుకోగులుతారో ప్రయోగాల ద్వారా తెలిసి వస్తుంది. పైగా, ప్రతి రోజూ ఒకే విధంగా సెక్స్ చేస్తే బోర్ కూడా కొడుతుంది. అందువల్ల ఎప్పటికప్పుడు కొత్త భంగిమలను, పద్ధతులను, కొత్త స్థలాలను వెతుక్కోవాలి.
లైంగిక భాగస్వాములు అనుభవం ద్వారా ఏ విధమైన పద్ధతులు ఎక్కువ ఆనందాన్ని ప్రసాదిస్తాయో తెలిసిపోతుంది. పురుషుడు తన స్త్రీ ఏ విధంగా తొందరగా క్లైమాక్స్‌కు చేరుకుంటుందో తెలుసుకుంటాడు. మహిళ కూడా అదే విధమైన అనుభవాన్ని పొందుతుంది. ఒకరికొకరు ఎక్కువ పరిచయం అవుతున్న కొద్దీ ఎక్కువ సార్లు సెక్స్‌లో పాల్గొంటున్న కొద్దీ అనుభవం పెరిగి అనుభూతికి లోను కావడానికి చేయాల్సిన పద్ధతులు తెలిసిపోతుంటాయి.
ఒక్కో మహిళకు ఒక్కో విధమైన సెన్సేషన్ జోన్ ఉండవచ్చు. కొంత మందికి క్లిటోరిస్‌ను ఉద్వేగ పరచడం ద్వారా భావప్రాప్తి త్వరగా కలగవచ్చు. కొందరికి జీ - స్పాట్ అసలైన కేంద్రంగా పనిచేస్తుంది. కామసూత్ర శృంగార క్రీడకు సంబంధించి ఓ శాస్త్రీయ గ్రంథం. భావప్రాప్తి చెందడానికి, సెక్స్‌లో క్లైమాక్స్‌కు చేరుకోవడానికి అవసరమైన సమాచారం ఇవ్వడానికి పుస్తకాలు చాలానే దొరుకుతాయి. వాటిని పరిశీలించడం మంచిది.