వయస్సు మీరుతున్న కొద్దీ స్త్రీపురుషుల్లో లైంగిక వాంఛలు తగ్గిపోతాయని సాధారణంగా అనుకుంటారు. అయితే, లైంగిక వాంఛలు యవ్వన దశలోనే ఉరకలు వేస్తాయని అనుకోవడం సరికాదని తాజాగా ఓ అధ్యయనం వెల్లడించింది. వయస్సు మీరే కొద్దీ తమ లైంగిక జీవితాంతం రంజుగా సాగుతోందని ఎంతో మంది మహిళలు చెబుతున్నారు. ఉద్వేగం, శారీరక సాన్నిహిత్యమే లైంగిక సంతృప్తికి దోహదం చేస్తాయని అంటున్నారు.
యవ్వనంలో కంటే 34 ఏళ్ళ నడిప్రాయంలోనే తాము మరింత సెక్సీగా ఉంటామని సగటు మహిళ భావిస్తున్నట్లుగా ఓ తాజా సర్వే చెబుతోంది. యవ్వనదశలో ఉన్నప్పటి కంటే నడివయస్సులోనే కోరికలను ఎక్కువగా తాము తీర్చుకోగలుగుతున్నామని బ్రిటన్‌ మహిళలు అభిప్రాయపడ్డారు.
ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ సెక్స్‌ జీవితాలు గతంలో కంటే ఇప్పుడే బాగున్నాయని చెప్పారు. 20 లేదా 30 ఏళ్ళ ప్రాయంలో తాము నెలలో 10 సార్లు పాల్గొనగా, 45 -60 ఏళ్ళ మధ్య కాలంలో అంతకు రెట్టింపుగా శృంగార జీవితం గడుపుతున్నట్టు సర్వేలో తెలిపింది.
34-38 ఏళ్ళ వయస్సులో తాము సెక్స్‌ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించామని వీరి అభిప్రాయం. మహిళల లైంగిక వాంఛలు, జీవనశైలి కాలానుగుణంగా మారుతూ వస్తాయనడం వాస్తవమే. అయితే మధ్యవయస్సులో మహిళలు తమ లైంగిక వాంఛలను మునుపటి వలే తీర్చుకోలేరని చెప్పడం హేతువిరుద్ధంగా ఉంటుందని ఈ సర్వేలో పాల్గొన్న మహిళల ఓ నిశ్చితాభిప్రాయాన్ని వెల్లడించారు.
ముఖ్యంగా, వృద్ధాప్యంలో కూడా తమ లైంగిక జీవితం సంతృప్తికరంగానే కొనసాగుతోందని వీరు చెప్పడం ఆశ్చర్యకరంగావుంది. దీనికి కారణం కూడా ఉంది. 20 లేదా 30 ఏళ్ళ వయస్సుతో పోలిస్తే మహిళలు తమ నడి వయస్సు ప్రారంభంలో మరింత ఆత్మవిశ్వాసంతోనూ, స్వావలంబనతో జీవితం గడుపుతున్నట్టు వెల్లడించారు.